Plastic Utensils: ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు!

Plastic Utensils: మీరు ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? అయితే జాగ్రత్త. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు...

Plastic Utensils: ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? ప్రమాదమే.. పరిశోధనలలో కీలక విషయాలు!
Plastic Utensils
Follow us
Subhash Goud

|

Updated on: Mar 29, 2022 | 9:32 AM

Plastic Utensils: మీరు ప్లాస్టిక్‌ పాత్రలో ఆహారం తింటున్నారా..? అయితే జాగ్రత్త. అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కొన్ని నెలల కిందట చేసిన పరిశోధనలలో పలు విషయాలు వెల్లడయ్యాయి. చల్లటి నీరు, పదార్థాలకు మంచిదే కానీ.. వేడి పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. వేడి పదార్థాలను ప్లాస్టిక్‌లో లేదా డిస్పోజబుల్‌ ప్లేట్ల (Plates)లో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్‌ ఫినాల్‌ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్‌ లేదా రీసైకిల్‌ కోడ్‌7గా పిలువబడే ఇది ప్లాస్టిక్‌లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్‌ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది..

ఎక్కువగా ప్లాస్టిక్‌ పాత్రలో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్‌ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్‌ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్‌కు బదులుగా మీరు పేపర్‌ టవల్‌, గ్లాస్‌ ప్లేట్‌ లేదా సిరామిక్‌ వస్తువులను ఉపయోగించాలంటున్నారు.

కాగా, ప్లాస్టిక్‌ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని పదేపదే చెబుతున్నా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లాస్టిక్‌ కవర్స్‌ను నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్‌ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్‌ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్‌ రూపుమాపడం లేదు.

ఇవి కూడా చదవండి:

Blood Pressure: బీపీ బాధితులకు అలర్ట్.. టీ తాగుతున్నారా..? ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

Health Tips : అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు!