Health Tips : అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు!

Health Tips: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, మంచి కూరగాయలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుు ఉంటాయి. కొంతమంది ఫ్రూట్ మిక్స్, సలాడ్ తింటుంటారు.

Health Tips : అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే ముప్పు తప్పదు!
Banana Papaya
Follow us

|

Updated on: Mar 29, 2022 | 6:58 AM

Health Tips: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, మంచి కూరగాయలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలుు ఉంటాయి. కొంతమంది ఫ్రూట్ మిక్స్, సలాడ్ తింటుంటారు. ఈ సలాడ్‌లలో అరటి, బొప్పాయి మిక్స్ చేసి ఉంటాయి. బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ఇక అరటి పండు కూడా శరీరానికి చాలా మేలు చేస్తుంది. అరటి పండులో ఘననీయంగా పోషకాలు ఉంటాయి. అరటి తినడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం అందుతుంది. కండరాలు బలపడుతాయి. అయితే, అరటి పండు, బొప్పాయి కలిపి తినొచ్చా? అనే సందేహం అనేక సందర్భాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరెండింటినీ కలిపి తినొచ్చా? లేదా? అనే దానిపై ఆరోగ్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పండ్లు, బొప్పాయి కలిపి తినొచ్చా? అరటిపండ్లు, బొప్పాయిని కలిపి తినడం వల్ల ప్రయోజనం ఉంటుందా? లేదా? అనేది పూర్తిగా సదరు వ్యక్తి జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కొందరికి జీర్ణశక్తి సరిగా ఉండదు. అలాంటప్పుడు అరటిపండు, బొప్పాయి కలిపి తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీర్ణశక్తి మంచిగా ఉన్నవారికి ఎలాంటి సమస్యా ఉండదు. ఆయుర్వేదంలో, అరటి – బొప్పాయి రెండింటినీ విరుద్ధమైన పండ్లుంగా పరిగణిస్తారు. ఈ రెండింటినీ కలిపి తినకూడదని చెబుతారు. ఈ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అరటిపండు, బొప్పాయిని కలిపి తింటే అజీర్తి, వాంతులు, వికారం, గ్యాస్ మొదలైన సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

అరటిపండు, బొప్పాయిని కలిపి ఎవరు తినకూడదు?.. బొప్పాయిలో పపైన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది ప్రజలకు జీర్ణ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది. బొప్పాయి – అరటి పండు కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కామెర్లు ఉన్న రోగులు బొప్పాయి తినకూడదు. ఇందులోని పపైన్, బీటా కెరోటిన్ కామెర్ల సమస్యను మరింత పెంచుతుంది. ఫలితంగా గాయాలు త్వరగా మానవు. బొప్పాయి – అరటిపండు కలిపి తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అలాగే, జలుబు, ఫ్లూ సమస్య ఉంటే సాయంత్రం వేళ అరటిపండ్లు తినడం మానుకోవాలి. శరీరంలో పొటాషియం ఎక్కువగా ఉంటే అరటిపండ్లను తినవద్దు. ఇది శరీరంలో తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

Also read:

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..