AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!

Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలంటే పెద్ద తలనొప్పి ఉంటుంది. లోన్ కోసం బ్యాంకులు లెక్కలేనన్ని కండీషన్లు పెడతాయి. అవన్నీ ఓకే అయితేనే, అది కూడా బ్యాంక్ అంగీకరిస్తేనే లోన్ యాక్సెప్ట్ అవుతుంది.

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!
Home Lone
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2022 | 9:58 PM

Share

Home Loan Tips: హోమ్ లోన్ తీసుకోవాలంటే పెద్ద తలనొప్పి ఉంటుంది. లోన్ కోసం బ్యాంకులు లెక్కలేనన్ని కండీషన్లు పెడతాయి. అవన్నీ ఓకే అయితేనే, అది కూడా బ్యాంక్ అంగీకరిస్తేనే లోన్ యాక్సెప్ట్ అవుతుంది. లేదంటే అంతే సంగతులు. అయితే, ఈ కండీషన్లలో ముఖ్యమైనది, లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ప్రధానంగా చూసేది.. క్రెడిట్ స్కోర్. ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే లోన్ ఇస్తాయి. తక్కువగా ఉంటే హోమ్ లోన్ పొందడం చాలా కష్టమవుతుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనుకాడతాయి. మరో కండీషన్ ఏంటంటే.. వ్యక్తి సంపాదన. స్వయం ఉపాధి పొందుతున్నట్లయితే ఇబ్బంది ఉండదు కానీ, శాలరీ అయితే లేనిపోని చిక్కులు ఎదురవుతాయి. అన్ని అంశాలను ఆరా తీస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో.. హోమ్ లోన్ పొందడానికి ఎక్స్‌పర్ట్స్ కీలక సలహాలు, సూచనలు చేస్తున్నారు. తక్కువ లోన్ కోసం అప్లై చేయడం, కో-అప్లికెంట్‌ని జాయింట్ చేయడం, సెక్యూర్డ్ లోన్ కోసం అప్లై చేయడం, ఎన్‌బిఎఫ్‌సికి అప్లై చేయడం ఇందులో ముఖ్యమైనవి.

వీటన్నింటిలోనూ ఇంకా ముఖ్యమైనదేంటంటే.. కో అప్లికెంట్‌ను యాడ్ చేయడం. దీని ద్వారా సులభంగా హోమ్ లోన్ పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎవరిని కో అప్లికెంట్‌గా యాడ్ చేయాలనేది మరో ప్రశ్న. అది.. వివిధ బ్యాంకుల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చూస్తే.. భర్త, భార్య, కొడుకు, తండ్రి, తల్లిదండ్రులు, అవివాహితులైన కుమార్తెలు సహ దరఖాస్తులుగా చేర్చుకోవడానికి అవకాశం ఉంది. వీరిలోనూ భర్త-భార్య కో అప్లికెంట్‌గా ప్రియారిటీ ఉంటుంది. ఈ జంట గృహ రునాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. దీని ప్రకారం.. చాలా మంది భర్త లేదా భార్యను కో-అప్లికెంట్‌గా యాడ్ చేస్తారు.

సహ-దరఖాస్తుదారుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు.. 1. సహ-దరఖాస్తుదారులు ఇద్దరూ మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడు రుణ ఆమోదానికి అవకాశాలు పెరుగుతాయి. 2. బ్యాంకులు హోమ్‌లోన్ మంజూరు చేయడానికి రుణదాత ఆర్థిక స్థిరత్వం, క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. అన్నీ సక్రమంగా ఉంటే.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే హోమ్‌లోన్ మంజూరు చేస్తారు. 3. ఆస్తిలో సహ-యజమానులుగా ఉన్న సహ-దరఖాస్తుదారులు ఉమ్మడి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. 4. హోమ్ లోన్ కోసం సహ-దరఖాస్తు చేయడం (కలిసి దరఖాస్తు చేసుకోవడం) దరఖాస్తుదారులిద్దరి అర్హతను పెంచుతుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. హోమ్ లోన్ తీసుకుంటే, సహ-దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆస్తికి సహ యజమాని కానవసరం లేదు. ఎలాంటి హక్కులు లేని వ్యక్తి కూడా సహ-దరఖాస్తుదారుగా మారవచ్చు. అయితే, ప్రధాన రుణదాత హోమ్ లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో, సహ-దరఖాస్తుదారు డబ్బును తిరిగి చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత ఉంటుంది. హోమ్ లోన్‌లో సహ-దరఖాస్తుదారుని చేయడం వలన లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించడం సులభం అవుతుంది.

ఇక కో-అప్లికెంట్, బ్యాంక్, లెండింగ్ ఏజెన్సీని ప్రామాణికతను, పారదర్శకతను, నిజాయితీని పరిశీలించుకోవాలి. ఇది భవిష్యత్‌లో తాము చిక్కుల్లో పడకుండా కాపాడుతుంది. మీరు బ్యాంకు నుంచి హోమ్ లోన్ పొందడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లయితే.. మంచి జీతం, మంచి ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారిని సహ దరఖాస్తుదారునిగా యాడ్ చేయండి. అలా చేయడం వలన, ఎక్కువ మొత్తం డబ్బుతో పాటు, త్వరలో లోన్ మంజూరు అవుతుంది.

Also read:

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

Railway Passenger Alert: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న ఆ ట్రైన్..