Home Loan: హోం లోన్ ఈఎంఐ చెల్లించకపోతే ఏమవుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..
RBI నివేదిక ప్రకారం, 31 మార్చి 2021 వరకు గృహ రుణ(Home Loan) పరిమాణం రూ. 22.4 లక్షల కోట్ల కంటే కాస్త ఎక్కువగా ఉంది...
RBI నివేదిక ప్రకారం, 31 మార్చి 2021 వరకు గృహ రుణ(Home Loan) పరిమాణం రూ. 22.4 లక్షల కోట్ల కంటే కాస్త ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 2021 వరకు మొత్తం లోన్‌లలో 6.1% మాత్రమే NPAలుగా వర్గీకరించారు. సెప్టెంబర్ 2022 నాటికి, ఆ సంఖ్య 8.1%కి చేరుకుంటుందని అంచనా. హోమ్ లోన్‌కు ఇందులో ఎక్కువ వాటా ఉంటుంది. ఒకవేళ విపత్కర పరిస్థితిలో మీరు హోమ్ లోన్ చెల్లించలేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఆప్షన్‌లు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఇటువంటి పరిస్థితులల్లో బ్యాంక్ ఏమి చేస్తుందో ముందుగా తెలుసుకోవాలు. RBI నిబంధనల ప్రకారం మీరు 90 రోజులలోపు హోమ్ లోన్ వాయిదాను చెల్లించకపోతే, బ్యాంక్ మీ మొత్తం లోన్‌ను NPA కేటగిరీలో ఉంచవచ్చు. లోన్ చెల్లించమని బ్యాంక్ మిమ్మల్ని అడగవచ్చు. మీరు EMI చెల్లించలేకపోతే, బ్యాంక్ మిమ్మల్ని డిఫాల్టర్‌గా ప్రకటిస్తుంది. అయితే, మీరు మీ EMI చెల్లింపు ఆగిపోతే, బ్యాంకు దానిని సీరియస్‌గా తీసుకోదు కానీ అది మీపై ఒత్తిడి తెస్తుంది.
2002 నుంచి అమలులోకి వచ్చిన సర్ఫేసీ చట్టం ప్రకారం, ఒక ఆస్తిని పూచీకత్తుగా ఇచ్చినట్లయితే, రుణదాత ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని, బకాయిలను తిరిగి పొందేందుకు దానిని విక్రయించవచ్చు. డిఫాల్ట్ అయిన వెంటనే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోవని టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పర్ట్ బల్వంత్ జైన్ చెప్పారు. ఎందుకంటే బ్యాంకు ఆస్తి కొనుగోలు.. అమ్మకం వ్యాపారం చేయదు. లోన్ ఇచ్చిన వ్యవస్థగా దాని ప్రధాన లక్ష్యం సకాలంలో బకాయిలను తిరిగి పొందడం. స్వాధీనం చేసుకున్న ఆస్తిని విక్రయించే ముందు, బకాయిలను రికవరీ చేయడానికి సాధ్యమయ్యే అన్ని ప్రత్యామ్నాయాలను బ్యాంకు పరిశీలిస్తుంది.
బకాయిలను రికవరీ చేయడం కోసం స్వాధీనం చేసుకున్న ఆస్తిని బ్యాంక్‌కు విక్రయిస్తే, మీ సమస్య అక్కడితో ముగియదని బల్వంత్ జైన్ చెబుతున్నారు. ఒకవేళ సీల్ చేసిన ఆస్తి విలువ రుణం మొత్తం కంటే తక్కువగా ఉంటే, మీరు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. అయితే, అమ్మకానికి వచ్చిన ఆస్తి, డిఫాల్ట్ లోన్ ఎమౌంట్ కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంక్ మీకు మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు క్యాపిటల్ గెయిన్ టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. నిబంధనల ప్రకారం, మీరు రుణం తీసుకోవడం.. డిఫాల్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలను CIBIL వంటి ఏజెన్సీలకు అందించాలి. కాబట్టి, మీరు డిఫాల్ట్ చేసిన సమాచారం కూడా CIBIL వద్ద ఉంటుంది.
Read also.. PAN-Aadhaar Link: సమయం లేదు మిత్రమా.. జరిమానా కడతావా.. ఆధార్ లింక్ చేస్తావా..