PAN-Aadhaar Link: సమయం లేదు మిత్రమా.. జరిమానా కడతావా.. ఆధార్‌ లింక్ చేస్తావా..

పాన్‌ ఆధార్ లింక్ చేయడానికి కేవలం మూడు రోజులే మిగిలి ఉంది. ఆ లోగా మీరు లింక్ చేయకుంటే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.

PAN-Aadhaar Link: సమయం లేదు మిత్రమా.. జరిమానా కడతావా.. ఆధార్‌ లింక్ చేస్తావా..
Follow us

|

Updated on: Mar 28, 2022 | 8:11 PM

పాన్‌(PAN) ఆధార్(Aadhaar) లింక్ చేయడానికి కేవలం మూడు రోజులే మిగిలి ఉంది. ఆ లోగా మీరు లింక్ చేయకుంటే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది గత ఏడాది 30 సెప్టెంబర్‌ వరకు గడువు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దానిని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోలేని వారు ఈ నెలాఖరులోగా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌. పాన్‌కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(Income tax) అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్‌ కార్డులు తీసుకుని మిస్‌ యూజ్‌ చేస్తుంటారు. ఇలా రెండు పాన్ కార్డులు తీసుకోవ‌డం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ రెండు పాన్‌ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్‌పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి.

☛ ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.

ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..

☛ ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.

☛ ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి.

☛ ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది.

☛ మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.

Read Also..  Business Cycle Fund: బిసినెస్ సైకిల్ ఫండ్ అంటే ఏమిటి?.. ఇందులో పెట్టుబడి పెడితే లాభామేనా..