House: వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయా.. రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO ఏం చెబుతుంది..
నిర్మాణ వ్యయం పెరగడం వల్ల వచ్చే ఆరు నెలల్లో రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని గృహ కొనుగోలుదారులలో దాదాపు సగం మంది అభిప్రాయపడ్డారు...
నిర్మాణ వ్యయం పెరగడం వల్ల వచ్చే ఆరు నెలల్లో రెసిడెన్షియల్ యూనిట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని గృహ కొనుగోలుదారులలో దాదాపు సగం మంది అభిప్రాయపడ్డారు. దీనితో పాటు 73 శాతం మంది ప్రజలు ఇళ్ల కొనుగోలుపై రాయితీలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను కూడా కోరుకుంటున్నారు. హౌసింగ్ పోర్టల్ Housing.com, రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO సంయుక్త సర్వేలో గృహవినియోదారులు తెలిపారు. ఈ సర్వే 2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో 3,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల అభిప్రాయం ఆధారంగా రూపొందించారు. Housing.com సోమవారం ‘రెసిడెన్షియల్ కన్స్యూమర్ సెంటిమెంట్ ఔట్‌లుక్ జనవరి-జూన్ 2022’ నివేదికను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు షేర్లు, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి ఇతర పెట్టుబడి సాధనాలకు బదులుగా రియల్ ఎస్టేట్(Real Estate)లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 2020 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ నిష్పత్తి 35 శాతం మాత్రమే.
Housing.com కాకుండా, Makaan.com, PropTiger.com గ్రూప్ CEO ధృవ్ అగర్వాల్ మాట్లాడుతూ “కోవిడ్ మహమ్మారి ప్రతి వ్యక్తికి సొంత ఇంటి అవసరాన్ని పెంచింది. ఇప్పుడు ప్రజలు పెద్ద ఇల్లు కోరుకుంటున్నారు. 2021 సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు 13 శాతం పెరిగాయని మా డేటా తెలియజేస్తోంది. 2022లో గృహ విక్రయాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకుంటాయని మేము నమ్ముతున్నాము.” అని అన్నారు. ఈ సర్వేలో చేర్చిన రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO అధ్యక్షుడు రాజన్ బందేల్కర్ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు తమ ఆదాయంలో పెరుగుదల గురించి ప్రజలు కూడా ఆశాజనకంగా ఉన్నారని చెప్పారు. దీంతో ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరగవచ్చు రానున్న ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 73 శాతం మంది ప్రజలు తమ ఇంటి కొనుగోలు ప్రణాళికను అమలు చేయడానికి ధర తగ్గింపులు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఆశిస్తున్నారు. గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం ఇచ్చే పన్ను మినహాయింపును పెంచాలని, నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని కోరారు. దీంతో పాటు చిన్న డెవలపర్లకు కూడా సులభంగా రుణాలు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also… Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..