- Telugu News Photo Gallery Summer Health Tips Want to stay healthy and fit for the summer Fallow This Tips
Summer Health Tips: వేసవి కాలంలో ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే, వీటిని ఫాలో అవ్వండి..
Updated on: Mar 29, 2022 | 6:30 AM

పాలకూర, దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేసవి కాలంలో వీటిని తింటే శరీరంలో నీటి శాతం పెరిగి.. హైడ్రేట్‌గా ఉంటారు.

దోసకాయ రసం: శరీరంలో తక్కువ నీటి స్థాయిలు మన ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి. అయితే, దోసకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే దోసకాయ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకుని తాగొచ్చు. టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి తాగొచ్చు.

దోసకాయ రైతా: రుచికరమైనది మాత్రమే కాదు, చాలా ఆరోగ్యకరమైనది కూడా. దోసకాయతో రైతా చేయడం చాలా ఈజీ. వేసవి కాలంలో దోసకాయ రైతా తిన్నా, తాగినా కడుపు చల్లగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వేగాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

పాలక్, దోసకాయ సలాడ్: దోసకాయ, పాలక్ సలాడ్‌ని ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. వేసవి, చలికాలంలో ఎప్పుడు తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలు, దోసకాయలు మరియు ఇతరులతో చేసిన సలాడ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

దోసకాయ సాంబార్ - ఇడ్లీ: ఇది కాస్త వింతగా అనిపించవచ్చు కానీ దోసకాయ సాంబర్ - ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది. దోసకాయ సాంబారు ఇడ్లీతో తినాలి. కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో, చాలా మంది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి దోసకాయ సాంబార్, ఇడ్లీలను తినడమే కారణం అని చెబుతుంటారు. (గమనిక: ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ టిప్స్‌ను పేర్కొనడం జరిగింది. వీటిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించడం కీలకం.)




