Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks: క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల రీఫండ్‌పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన.. ఏమన్నారంటే.

బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లను రీఫండ్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇది పూర్తి కావడానికి మరికొంత కాలం పట్టే సూచనలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. న్యాయపరమైన చిక్కుల..

Banks: క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల రీఫండ్‌పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన.. ఏమన్నారంటే.
Unclaimed Funds India
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2023 | 7:35 PM

బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లను రీఫండ్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇది పూర్తి కావడానికి మరికొంత కాలం పట్టే సూచనలు ఉన్నాయి. ఇదే విషయంపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. న్యాయపరమైన చిక్కుల కారణంగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి పరిష్కరించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇటువంటి డిపాజిట్లు లేదా షేర్ల కు నామినీ లేకపోతే ఇది మరింత క్లిష్టం అవుతుందన్నారు. నామినీ ఎవరో తెలుసుకోవడానికి.. చట్టపరమైన వారాసుడి గుర్తింపు కోసం సమయం పడుతుంది. అంతేకాదు క్లెయిమ్ చేయని డిపాజిట్లు క్లియర్ చేసిన తరువాత చట్టపరమైన చిక్కులు లేకుండా ఉండేలా చూడటానికి సమయం పడుతుంది అని చెప్పారు.

“పూర్తిగా సంతృప్తి చెందవలసిన అనేక చట్టపరమైన అంశాలు ఉండవచ్చు. ఆ డబ్బుకు సంబంధించిన క్లియరెన్స్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి దీనికి సమయం పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే డబ్బును క్లియర్ చేయగలదని భ్రమలో క్లెయిమ్ చేయని డిపాజిట్ కు సంబంధించిన వారు ఉండకూడదు. ఈ పని పూర్తికాదు అని నేను చెప్పను.. కానీ.. ఈరోజు అనుకుని రేపు అవ్వాలంటే అవదు అని సీతారామన్ స్పష్టం చేశారు. ఈ నెల ప్రారంభంలో అంటే మే 8న జరిగిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశంలో అన్‌క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్లు, ఫైనాన్షియల్ సెక్టార్ క్లెయిమ్‌లను పరిష్కరించడానికి ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించాలని భారత నియంత్రణ సంస్థలకు ఆమె పిలుపునిచ్చిన తర్వాత ఇప్పుడు సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక మంత్రి ఆదేశాలను అనుసరించి, మే 12న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జూన్ 1న ‘100 రోజుల 100 చెల్లింపులు’ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రచారం కింద, బ్యాంకులు క్లెయిమ్ చేయని టాప్ 100 డిపాజిట్లను గుర్తించి, సెటిల్ చేస్తాయి. 100 రోజుల్లో ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంకు నుంచి క్లెయిమ్ చేయని డిపాజిట్లను గుర్తిస్తారు. ఆర్‌బిఐ ఏప్రిల్ 6న వెబ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసిన తరువాత పలు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం ప్రజానీకం వెతకడానికి వీలు కల్పిస్తుంది. 10 సంవత్సరాలుగా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు RBI డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ అవుతాయి. ప్రస్తుతం, బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల జాబితాను ప్రదర్శిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..