Yamaha Offers: యమహా బైక్స్‌పై పండుగ ఆఫర్లు షురూ.. తగ్గింపులు ఎంతంటే..?
భారతదేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో విక్రయాలు పెంచుకోవడంతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. తాజాగా జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఈ పండుగ సీజన్‌లో కొన్ని మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. యమహా ప్రస్తుతం ఫాసినో 125, ర్యాజర్ హైబ్రిడ్ స్కూటర్లతో పాటు ఎఫ్‌జెడ్ మోడల్స్‌పై నమ్మలేని తగ్గింపులను ప్రవేశపెట్టింది. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4.0, ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 3.0 రెండూ బైక్స్‌పై రూ.7,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.
భారతదేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఈ సీజన్‌లో విక్రయాలు పెంచుకోవడంతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అన్ని కంపెనీలు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తాయి. తాజాగా జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఈ పండుగ సీజన్‌లో కొన్ని మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. యమహా ప్రస్తుతం ఫాసినో 125, ర్యాజర్ హైబ్రిడ్ స్కూటర్లతో పాటు ఎఫ్‌జెడ్ మోడల్స్‌పై నమ్మలేని తగ్గింపులను ప్రవేశపెట్టింది. యమహా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4.0, ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 3.0 రెండూ బైక్స్‌పై రూ.7,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా. అలాగే ఈ రెండు బైక్స్ రూ.7,999 డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వీ4 ప్రారంభ ధర రూ.1.29 లక్షలు కాగా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ వీ3 ప్రారంభ ధర రూ.1.06 లక్షలు, ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అలాగే ఫాసినో 125, ర్యాజర్ హైబ్రిడ్ స్కూటర్లపై రూ.4000 తక్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో యమహా ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4
ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4 149 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 13.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూటీలో ఉన్న గేర్బాక్స్ 5 స్పీడ్ యూనిట్‌తో వస్తుంది. సస్పెన్షన్ డ్యూటీల కోసం ముందువైపు టెలిస్కోపిక్ యూనిట్లు, వెనుకవైపు మోనోషాక్‌తో వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు సింగిల్-ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది.
ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 3
ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 4 మాదిరిగానే వీ3 కూడా 149 సీసీ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో 12 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 13.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూటీలో ఉన్న గేర్బాక్స్ 5-స్పీడ్ యూనిట్ ఆకట్టుకుంటుంది.
యమహా ర్యాజర్ 125
ఈ స్కూటర్ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ 125 సీసీ బ్లూ కోర్ ఇంజన్ నుంచి శక్తిని తీసుకుంటుంది. ఈ స్కూటర్ 6,500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 8.2 పీఎస్ శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హైబ్రిడ్ సిస్టమ్‌కు సంబంధించిన అదనపు కార్యాచరణతో స్మార్ట్ మోటార్ జనరేటర్ వ్యవస్థతో వస్తుంది.
ఫాసినో 125
ఫాసినో 125 హైబ్రిడ్ బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీని పొందే ఐఆర్ కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ 125 సీసీ ఇంజిన్‌తో పవర్ ట్రెయిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ పవర్ ట్రెయిన్ 6,500 ఆర్‌పీఎం వద్ద 8.2 పీఎస్ గరిష్ట శక్తిని, 5,000 ఆర్‌పీఎం వద్ద 10.3 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ స్కూటర్ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..