Gold Price: ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి.. అయితే.. ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి..

Gold Price: ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold PricesImage Credit source: Getty Images
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2024 | 6:41 AM

ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి.. అయితే.. ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దసరా నవరాత్రులు, దీపావళి పర్వదినానికి ముందు పసిడి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు, మగువలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ధరలు స్వల్పంగా పెరిగాయి.. శనివారం (28 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.77,460 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.96,100గా ఉంది.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

గోల్డ్ రేట్లు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,010, 24 క్యారెట్ల ధర రూ.77,460 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,010, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,460 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,160, 24 క్యారెట్ల ధర రూ.77,610 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.71,010, 24 క్యారెట్లు రూ.77,460

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.71,010, 24 క్యారెట్లు రూ.77,460

బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.71,010, 24 క్యారెట్లు రూ.77,460గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.102,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.102,100లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,100, ముంబైలో రూ.96,100, బెంగళూరులో రూ.89,900, చెన్నైలో రూ.102,100 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..