Fact Check: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ.6వేల భృతి ఇస్తుందా..? ఇందులో నిజమెంత..?
Fact Check: ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలను కొందరు వైరల్ చేయడంతో అది నిజమేనని నమ్మి మోసపోతున్నారు...
Fact Check: ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలను కొందరు వైరల్ చేయడంతో అది నిజమేనని నమ్మి మోసపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రధాన్ మంత్రి బేరోజ్‌గర్ భట్టా యోజన’ కింద నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నెలవారీ రూ. 6,000 సహాయం అందిస్తోందని వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా, దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలనెల రూ.6వేలు ఇవ్వనుంది. ప్రధాన్ మంత్రి బెరోజ్‌గర్ భట్టా యోజన 2022’ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కింద నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ. 6,000 లభిస్తుంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है #PIBFactCheck
▶️ यह मैसेज फर्जी है
▶️ भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही
▶️ कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें pic.twitter.com/jwqhr6hVk2
— PIB Fact Check (@PIBFactCheck) June 7, 2022
అయితే ప్రభుత్వ సంస్థ అయినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ నివేదికపై వాస్తవ తనిఖీని నిర్వహించింది. ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ఏదీ అమలు చేయడం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని పీఐబీ కోరింది.
జనాలు సోషల్ మీడియాలో వచ్చింది ఏదిపడితే అది నమ్మవద్దని సూచించింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఆసరా చేసుకుని మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి న్యూస్‌ను క్రియేట్ చేసి ప్రజలను మోసాగిస్తు్న్నారని తెలిపింది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి