Resignations: దేశంలో రాజీనామాలు చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు పెరుగుతున్నారు..
Resignations: దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేస్తున్న రాజీనామాల పర్వం.. ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
Resignations: దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేస్తున్న రాజీనామాల పర్వం.. ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ మైఖేల్ పేజ్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఆరు నెలల కాలంలో 86 శాతం మంది ఉద్యోగులు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. ఉద్యోగులు ఆనందం, మెరుగైన పని జీవిత సమతుల్యత, మెరుగైన జీవితాన్ని కోరుకుంటున్నట్లు తెలిపింది. నివేదిక ప్రకారం.. 61 శాతం మంది ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపింది. మెరుగైన పని జీవిత సమతుల్యత కోసం తక్కువ వేతనాలను సైతం ఉద్యోగులు అంగీకరిస్తున్నారని తెలిపింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలుగా రాజీనామాల పర్వం జరుగుతోంది, రాజీనామాలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. ఈ ట్రెండ్ అన్ని మార్కెట్లు, పరిశ్రమలు, అన్ని వయసుల వారి నుంచి అన్ని స్థాయిల్లో కనిపిస్తోందని రిక్రూట్ మెంట్ సంస్థ వెల్లడించారు.
బిగ్ టాలెంట్ మైగ్రేషన్:
రాబోయే కొద్ది నెలల్లో ప్రతిభావంతుల వలసలు భారీగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీన్ని అధిగమించేదుకు కంపెనీలు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగులు రాజీనామా చేయడానికి కారణాలు కెరీర్ పురోగతి, కెరీర్ పాత్ర లేదా పరిశ్రమలో మార్పు, జీతం పట్ల అసంతృప్తి, కంపెనీ వ్యూహం లేదా గ్రోత్ పై అసంతృప్తిగా తెలుస్తోంది. ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాలను వదిలేయాలని యోచిస్తున్న 12 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారతీయులు ముందంజలో ఉన్నారని నివేదిక వెల్లడించింది . దీని తర్వాత ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయ్‌లాండ్, ఆగ్నేయాసియాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రైవేట్ ఉద్యోగుల కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే రాజీనామా చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక విషయం ఏంటంటే.. ప్రయివేటు రంగం కంటే ప్రభుత్వ రంగ ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దాని తర్వాత ఎనర్జీ, సహజ వనరులు, తయారీ, ప్రయాణం/పర్యాటకం, రిటైల్ ఇతర పరిశ్రమలు ఉన్నాయి.