Post Office vs SBI: ఆ పథకాల్లో పెట్టుబడితో కళ్లుచెదిరే వడ్డీ.. ఎస్‌బీఐ, పోస్టాఫీస్ ఎఫ్‌డీల మధ్య ప్రధాన తేడా ఇదే..
ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ పెంపుతో అన్ని బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. 10 నెలల క్రితం 5 శాతం ఉన్న ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ప్రస్తుతం 7.7 శాతానికి పెరిగాయి. అలాగే ఇటీవల ఇండియన్ పోస్ట్స్ కూడా టైమ్ డిపాజిట్లపై వడ్డీని గణనీయంగా పెంచింది.

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వివిధ పథకాలపై భారీ వడ్డీ రేటును అందిస్తాయి. అయితే ఈ విషయంలో ఇండియన్ పోస్ట్స్ కాస్త వెనుకబడివ ఉంటుంది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ పెంపుతో అన్ని బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. 10 నెలల క్రితం 5 శాతం ఉన్న ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ప్రస్తుతం 7.7 శాతానికి పెరిగాయి. అలాగే ఇటీవల ఇండియన్ పోస్ట్స్ కూడా టైమ్ డిపాజిట్లపై వడ్డీని గణనీయంగా పెంచింది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు కూడా ఎఫ్‌డీల కంటే సురక్షితమైన ఎంపికగా చాలా మంది పరిగణిస్తారు. అయితే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై త్రైమాసిక రేట్ల సవరణ ఉంటుంది. ఇటీవలి కాలంలో బ్యాంక్ ఎఫ్‌డీల కంటే తక్కువ రాబడిని పొందుతున్న పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్‌లు, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం భారీగా పెంచడంతో మళ్లీ పోటీగా మారాయి.
పోస్టాఫీస్ వడ్డీ రేట్లు ఇలా
చిన్న పొదుపు పథకాల కింద రెండు సంవత్సరాల పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లపై వచ్చే రాబడి 6.9 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటును మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే మూడేళ్ల పీఓటీడీపై రేటు కూడా 5.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. చిన్న పొదుపు సాధనాలు (ఎస్ఎస్ఐ)ల విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ప్రభుత్వం వడ్డీ రేట్లను 10 నుంచి 70 బేస్ పాయింట్లకు పెంచింది. అలాగే మొదటి సంవత్సరం 6.8 శాతం, రెండో ఏడాది 6.9 శాతం, మూడో సంవత్సరం 7.0 శాతం, ఐదో ఏడాది 7.5 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. పెంచిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఎస్‌బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్ల వడ్డీ ఇలా
ఎస్‌బీఐలో 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలకు భారీ వడ్డీని అందిస్తున్నారు. సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.1 శాతం వడ్డీ రేటు అందుతుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై దాదాపు 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) అదనంగా పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఈ రేట్లు 15 ఫిబ్రవరి 2023 నుండి అమలులోకి వచ్చాయి.




మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం