Budget 2024: అదే జరిగితే.. ఐఫోన్ ధరలు భారీగా తగ్గుతాయ్! మరి కేంద్రం ఏం చేస్తుంది..

హై-ఎండ్ మొబైల్ ఫోన్‌ల తయారీలో ఉపయోగించే కీలకమైన భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1న జరగబోయే మధ్యంతర బడ్జెట్ 2024-25లో సంభావ్య సుంకం తగ్గింపును చేర్చాలనే లక్ష్యంతో ఒక ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Budget 2024: అదే జరిగితే.. ఐఫోన్ ధరలు భారీగా తగ్గుతాయ్! మరి కేంద్రం ఏం చేస్తుంది..
Union Budget 2024
Follow us
Madhu

|

Updated on: Jan 14, 2024 | 6:09 PM

మరో వారంలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ 2024పై అందరికీ భారీగా ఆశలు నెలకొన్నాయి. తమ తమ రంగాల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఎటువంటి ప్రోత్సాహకాలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే హై-ఎండ్ మొబైల్ ఫోన్‌ల తయారీలో ఉపయోగించే కీలకమైన భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1న జరగబోయే మధ్యంతర బడ్జెట్ 2024-25లో సంభావ్య సుంకం తగ్గింపును చేర్చాలనే లక్ష్యంతో ఒక ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆపిల్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది.అలాగే దేశం నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని వివరిస్తున్నాయి.

భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి విడిభాగాలపై సుంకం తగ్గింపు కోసం అనేక పరిశ్రమల సంస్థలు ఎదురుచూస్తున్నాయి. చైనా, వియత్నాం వంటి ప్రాంతీయ పోటీదారులతో పోటీ పడేందుకు సైతం ఇది బాగా ఉపకరిస్తుంది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లిస్టింగ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బడ్జెట్‌ను ఖరారు చేసేటప్పుడు ఈ ప్రతిపాదిత తగ్గింపులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సమాచారం ప్రకారం, కెమెరా మాడ్యూల్స్, ఛార్జర్‌లతో సహా మొబైల్ ఫోన్ భాగాలపై ప్రస్తుత దిగుమతి సుంకాలు 2.5 శాతం నుంచి 20 శాతం వరకు ఉన్నాయి. ఇది చైనా, వియత్నాం, మెక్సికో మరియు థాయ్‌లాండ్‌తో సహా ఆరు సారూప్య ఉత్పాదక దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ.

ఇవి కూడా చదవండి

దిగుమతి సుంకం తగ్గితే ఎగుమతులు పెరుగుతాయ్..

దిగుమతి సుంకం తగ్గితే సెల్ ఫోన్ ఎగుమతులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సుంకాలు తగ్గించకపోతే, భారతదేశ మొబైల్ ఫోన్ ఎగుమతి వృద్ధి మందగించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో (2022/23) మొబైల్ ఫోన్ ఎగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెండింతలు పెరిగి $11.1 బిలియన్లకు చేరుకున్నాయి. స్థానిక తయారీకి మద్దతు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాల సహాయంతో. 2023/24 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి