AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Sale: గృహ రుణం ఉన్నా ఇంటిని సింపుల్‌గా అమ్మేయ్యండి.. చేయాల్సింది ఇదే

అయితే హోం లోన్ ఈఎంఐ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. దీంతో ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటిని అమ్మేయాలనుకున్నా ఈఎంఐ వల్ల కుదరదని అనుకుంటూ ఉంటారు. అయితే హోం లోన్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హోం లోన్ ఉన్నా సింపుల్‌గా ఇంటిని అమ్మేయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

House Sale: గృహ రుణం ఉన్నా ఇంటిని సింపుల్‌గా అమ్మేయ్యండి.. చేయాల్సింది ఇదే
Own House
Nikhil
|

Updated on: Apr 19, 2023 | 2:45 PM

Share

మధ్యతరగతి వారికి సొంతిల్లు అంటే ఓ ఎమోషన్. అందుకే ఎంత కష్టపడైన సొంతింటిని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా హోంలోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అద్దె భారం నుంచి తప్పించుకోవడంతో సొంతిల్లు సమకూరుతుందనే ఉద్దేశంతో ఎక్కువమంది ఉద్యోగస్తులు హోం లోన్ సహాయంతో ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే హోం లోన్ ఈఎంఐ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. దీంతో ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటిని అమ్మేయాలనుకున్నా ఈఎంఐ వల్ల కుదరదని అనుకుంటూ ఉంటారు. అయితే హోం లోన్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హోం లోన్ ఉన్నా సింపుల్‌గా ఇంటిని అమ్మేయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే లోన్ ఉన్న ఇంటిని ఎలా అమ్మాలో ఓ సారి తెలుసుకుందాం.

మీరు ఫైనాన్సింగ్ బ్యాంక్ లేదా లెండర్ ముందస్తు సమ్మతితో లోన్ ఉన్న ఇంటిని విక్రయించవచ్చని నిబంధనలు తెలుపుతున్నాయి. ఒకవేళ మీ ఇంటిని కొనాలనుకునేవారు కూడా ఈఎంఐ ద్వారా ఇంటిని కొనాలనుకుంటే వారు కూడా ఆ బ్యాంకును సంప్రదిస్తే ప్రక్రియ చాలా సులభంగా అవుతుంది. ఈ సందర్భాలలో చెల్లింపు పొందడానికి ముందు బ్యాంక్ ఆస్తి పత్రాలను మరో బ్యాంకుకు విడుదల చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ కొనుగోలుదారు పూర్తిగా చెల్లింపు చేయాలనుకుంటే దాన్ని నేరుగా బ్యాంకుకు చేయవచ్చు. బ్యాంక్ మొత్తం రుణ మొత్తాన్ని, అలాగే ఇతర బకాయిలను రికవరీ చేసిన తర్వాత మాత్రమే ఆస్తి పత్రాలు విడుదల చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మీరు మీ హోమ్ లోన్‌పై బకాయి ఉన్న బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలి. అలాగే దానిని చెల్లించడానికి మీ వద్ద తగిన నిధులు ఉన్నాయని నిర్ధారించుకోండి. రుణాన్ని చెల్లించడానికి మీ వద్ద తగినంత నిధులు లేకుంటే మీరు మీ బ్యాంక్‌ను సంప్రదించి వ్యక్తిగత రుణం వంటి ఇతర ఎంపికల కోసం వెతకాలి. ముఖ్యంగా మీ ఇంటిని విక్రయించాలంటే మీ రుణదాత నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) పొందాల్సి ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసుకునేవారు ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకుంటారు. హోంలోన్ ఉన్న ఇంటిని అమ్మాలనుకుంటే మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి