AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercedes Benz: లగ్జరీ కారా మజాకా? ఫ్రిజ్, హీటర్, మసాజ్ అన్నీ కారులోనే.. బెంజ్ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అదిరిందిగా..

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్ బెంజ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. స్టన్నింగ్ లుక్ తో పాటు అదరగొట్టే ఫీచర్లున్న ఈ కారు రేంజ్ కూడా అదే లెవెల్ లో ఉంటుంది. దీని పేరు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఈక్యూఎస్680 ఎస్‌యూవీ(Mayback EQS680 SUV).

Mercedes Benz: లగ్జరీ కారా మజాకా? ఫ్రిజ్, హీటర్, మసాజ్ అన్నీ కారులోనే.. బెంజ్ కంపెనీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అదిరిందిగా..
Mercedes Maybach Eqs Suv
Madhu
|

Updated on: Apr 19, 2023 | 3:15 PM

Share

ఆటో ఇండస్ట్రీ అంతా విద్యుత్ శ్రేణి వాహనాలపైనే ఫోకస్ పెట్టింది. దిగ్గజ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, సూపర్ రేంజ్ తో తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు కూడా విరివిగా తమ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీదారు మెర్సిడెస్ బెంజ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. స్టన్నింగ్ లుక్ తో పాటు అదరగొట్టే ఫీచర్లున్న ఈ కారు రేంజ్ కూడా అదే లెవెల్ లో ఉంటుంది. దీని పేరు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఈక్యూఎస్680 ఎస్‌యూవీ(Mayback EQS680 SUV). 2021లోనే దీనిని ప్రకటించిన సంస్థ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేసింది. 2024 ప్రారంభంలో అమెరికాలో దీని అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

డిజైన్, లుక్.. మెర్సిడెస్ మేబ్యాక్ ఈక్యూఎస్ 680 కారు మేబ్యాక్ డిజైన్ తన మరో మోడల్ జీఎల్ఎస్600లా ఉంటుంది. అయితే ఈ కారులో మరిన్ని అధునాతన ఫీచర్లు, సస్పెన్షన్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేసి, అల్ట్రా ప్రీమియం లుక్ లో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలను కల్పించారు. ఈ ఎస్​యూవీ ఫ్రెంట్​లో 3డీ వర్టికల్​తో కూడిన బ్లాక్​ గ్రిల్​ వస్తుంది. క్రోమ్​ ప్లేటెడ్​ ట్రిమ్​ స్ట్రిప్స్​ సైతం ఉన్నాయి. 21-22 ఇంచ్​ అలాయ్​, ఫోర్జ్​డ్​ వీల్స్​ కూడా లభిస్తున్నాయి. రేర్​లో ఎల్​ఈడీ స్ట్రిప్​ వస్తోంది. ఇక ఈ ఈవీ క్యాబిన్​ చాలా లగ్జరీగా ఉంటుంది. 2 రో సీటింగ్​ అరేంజ్​మెంట్​ ఉన్న ఈ ఎస్​యూవీ సీట్లను దాదాపు పూర్తిగా ఫ్లాట్​గా చేయవచ్చు.

సామర్థ్యం.. ఈకారు 649హెచ్పీ/949ఎన్ఎం శక్తిని అందించే ట్విన్-మోటార్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతుంది. కారు 4.1 సెకన్లలో 0-96కిలోటమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 598.6కిమీల పరిధిని అందిస్తుంది. ఇది డెడికేటెడ్ మేబ్యాక్ డ్రైవింగ్ మోడ్‌తో కూడిన ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ను కూడా పొందుతుంది. ఈ ఈక్యూఎస్​ 680 టాప్​ స్పీడ్​ 210 కేఎంపీహెచ్​. ఇందులో 22కేడబ్ల్యూ ఛార్జర్​ ఉంటుందని, ఇది 200కేడ్ల్యూ వరకు డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​కు సపోర్ట్​ చేస్తుందని సంస్థ చెబుతోంది. ఫాస్ట్​ ఛార్జర్​తో కేవలం 30 నిమిషాల్లోనే ఈ ఈవీ పూర్తిగా ఛార్జ్​ అవుతుందని అంటోంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు.. ఈ ఈక్యూఎస్​ 680 కారులో ని కార్పెట్‌పై మేబ్యాక్ లోగోను ప్రొజెక్ట్ చేసే పుడ్ల్ ల్యాంప్, టైప్-సి పోర్ట్‌లు, ఫ్లోటింగ్-స్టైల్ సెంటర్ కన్సోల్, సిల్వర్-ప్లేటెడ్ షాంపైన్ ఫ్లూట్స్, రిమూవబుల్ రిఫ్రిజిరేటర్, హీటింగ్, మసాజ్ సౌకర్యాలతో సీట్లు ఉన్నాయి. ముందు సీట్లలో ప్రయాణీకుల కోసం 56.0-అంగుళాల ఎంబీయూఎక్స్ హైపర్‌స్క్రీన్, వెనుక సీటులో ఉన్నవారి కోసం రెండు 11.6-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంది.

ధర, లభ్యత.. ఈ కారు ప్రారంభ ధర దాదాపు $200,000 (దాదాపు రూ. 1.64 కోట్లు) ఉంటుందని అంచనా. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది అమెరికాలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ వాహనాన్ని అమెరికాలోని అలబామా ఓఈఎం ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..