Volkswagen Car: మార్కెట్‌లోకి న్యూ వోక్స్‌వ్యాగన్ ఈవీ కార్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా..!

ఐడీ.4జీటీఎక్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్ ఇప్పటికే పరీక్షల దశలో ఉందని తెలుస్తోంది. ఇటీవల కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఆ కంపెనీ వార్షిక సదస్సులో అధికారికంగా సరికొత్త వోక్స్‌వ్యాగన్ ఐడీ.4 జీటీఎక్స్‌ని రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

Volkswagen Car: మార్కెట్‌లోకి న్యూ వోక్స్‌వ్యాగన్ ఈవీ కార్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా..!
Volkswagen
Follow us
Srinu

|

Updated on: Apr 19, 2023 | 3:15 PM

కార్ల ప్రియులను వోక్స్‌వ్యాగన్ కార్ అంటే ఓ క్రేజ్. వోక్స్‌వాగన్ కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ఈ ట్రెండ్‌ను ఫాలో వోక్స్‌వాగన్ సరికొత్త ఈవీ కార్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఐడీ.4జీటీఎక్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్ ఇప్పటికే పరీక్షల దశలో ఉందని తెలుస్తోంది. ఇటీవల కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఆ కంపెనీ వార్షిక సదస్సులో అధికారికంగా సరికొత్త వోక్స్‌వ్యాగన్ ఐడీ.4 జీటీఎక్స్‌ని రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఈవీ కార్ ముఖ్యంగా హ్యుందాయ్ కంపెనీకీ చెందిన ఐనిక్‌కు ప్రత్యర్థిగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఈ కార్ ధర రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.ఈ కార్ ఇతర ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

వోక్స్‌వ్యాగన్ ఐడీ.4 జీటీఎక్స్‌ ఫీచర్లు ఇవే

వోక్స్‌వ్యాగన్ కంపెనీకు చెందిన ఇతర ఈవీ కార్‌లతో పోలిస్తే వోక్స్‌వ్యాగన్ ఐడీ.4 జీటీఎక్స్‌ అధునాతన ఫీచర్లు అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా డిజైన్‌పరంగా కూడా ఎన్నో మార్పులు చేశారు. ముఖ్యంగా జీటీఎక్స్ బ్యాడ్జ్‌లు, బ్లాక్ రూఫ్‌, గ్లోసీ బ్లాక్ ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్స్, ఆంత్రాసైట్ రూఫ్ బార్‌లు, రియర్ స్పాయిలర్‌లు వంటి వాటితో కార్ మంచి స్పోర్టీ లుక్‌తో ఆకర్షిస్తుంది. వెనుక బంపర్ డిజైన్‌తో పాటు ముందు, వెనుక అమర్చిన ఎల్ఈడీ లైట్లు వినియోగదారులను ఆకర్షించేలా ఉన్నాయి. అలాగే ఇంటీరియర్ విషయానికి వస్తే కార్‌లో ముదురు నీలం రంగు డాష్‌బోర్డ్ ప్యానెల్‌లు, లెథెరెట్ డోర్ ఇన్‌సర్ట్‌లు, రెడ్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్‌తో పాటు ప్రీమియం స్పోర్ట్స్ సీట్లతో మంచి కంఫర్ట్ లెవల్స్‌ను అందిస్తాయి. అలాగే ఈ కార్ డాష్‌బోర్డ్‌లో 12 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆకర్షణీయంగా ఉంది. వోక్స్‌వ్యాగన్ ఐడీ.4 జీటీఎక్స్‌ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ కార్‌లో 77 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ కార్‌ ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా ధ్రువీకరించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..