EPFO Pensioners: ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు శుభవార్త.. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు
EPFO Pensioners: ఈపీఎఫ్వోపెన్షనర్లకు శుభవార్త ఉంది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన పెన్షనర్లు ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్‌లను సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని..
EPFO Pensioners: ఈపీఎఫ్వోపెన్షనర్లకు శుభవార్త ఉంది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన పెన్షనర్లు ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్‌లను సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో మార్గదర్శకాలను విడుదల చేసింది. EPS 95 పెన్షనర్లు ఇప్పుడు జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చని EPFO ట్వీట్ చేసింది. ఇది సమర్పించిన తర్వాత ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగుల పెన్షన్ పథకం-95 నవంబర్ 1995 నుండి అమలులోకి వచ్చింది. EPFO జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ సమర్పించడానికి EPS పెన్షనర్లకు వివిధ సౌకర్యాలను కల్పించింది. దీనిలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను మీ ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అలాగే ఆన్‌లైన్, ఇతర మార్గాలు, ఏజెన్సీల ద్వారా సమర్పించిన జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది.
EPS’95 Pensioners can now submit Life Certificate at any time which will be valid for 1 year from date of submission.#EPFO #Pension #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/BNR79gCwjv
— EPFO (@socialepfo) August 28, 2022
EPF పెన్షనర్లు 135 ప్రాంతీయ కార్యాలయాలు, ఈపీఎఫ్‌ఓకు చెందిన 117 జిల్లా కార్యాలయాలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ 3.65 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా సమర్పించవచ్చు. UMANG యాప్‌ని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కూడా పింఛనుదారుల ఇంటి నుండి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సేకరించే సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే పింఛనుదారులు చిన్నపాటి రుసుము చెల్లించి పోస్టాఫీసు డోర్‌స్టెప్ సదుపాయం ద్వారా కూడా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించే వెసులు బాటు ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు పోస్టుమ్యాన్ మీ ఇంటికి వచ్చి ఈ సర్టిఫికేట్‌ను తీసుకుని అప్‌డేట్ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి