Business Idea: ఇంటి నుంచే మొబైల్ ద్వారా వ్యాపారం.. కేవలం రూ.5 వేలతో వేలల్లో సంపాదన.. ఈ ఒక్క యాప్ ఉంటే..
ఇండియా పోస్ట్ మంచి అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.5 వేలతో ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. పార్సిళ్లు డెలివరీ, పికప్, బుకింగ్ చేసి నెలకు వేలల్లో సంపాదించవచ్చు. ఈ మేరకు పోస్టల్ శాఖ ప్రాంచైజీ 2.0 పేరుతో కొత్త పథకం తాజాగా ప్రారంభించింది.

ఇంటి వద్ద ఉండి మొబైల్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకునేవారికి అద్బుత అవకాశం. జస్ట్ రూ.5 వేలు మీ దగ్గర ఉంటే చాలు.. వ్యాపారం స్టార్ట్ చేసి వేలల్లో సంపాదించవచ్చు. మొబైల్ ద్వారానే మీరు ఈ వ్యాపారం నిర్వహించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖ వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం కొత్తగా ఇండియా పోస్ట్ ప్రాంచైజ్ స్కీమ్ 2.0 ప్రవేశపెట్టింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అసలు ఈ ప్రాంచైజీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా ఆదాయం పొందవచ్చు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
వ్యాపారం ఎలా చేయాలి..?
పార్శిల్స్, కొరియళ్లు పికప్, డెలివరీ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ప్రజలకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేసేందుకు, మరింత వేగంగా డెలివరీ చేసేందుకు ప్రాంఛైజీ పథకాన్ని పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. దేశంలో నివసించే ఎవరైనా ఈ ప్రాంఛైజీ తీసుకోవచ్చు. మీ ఏరియాల్లో పోస్టల్ సేవలు అందించి ఆదాయం పొందవచ్చు.
సేవలు ఏంటంటే..?
మీరు స్పీడ్ పోస్ట్, పార్సిళ్లు బుకింగ్ చేయడంతో పాటు పార్సిళ్లు పికప్, డెలివరీ, క్లిక్ అండ్ బుక్, అంతర్జాతీయ ఈఎంఎస్ సేవలు వంటి అందించాల్సి ఉంటుంది. మీరు పికప్, డెలివరీ, బుకింగ్ వంటి సేవల్లో ఏదైనా ఎంచుకుని ప్రాంచైజీ తీసుకోవచ్చు.
అర్హతలు ఇవే..
-18 ఏళ్ల నిండి ఉండాలి
-బుకింగ్ సేవల కసం ఇంటర్ పూర్తి చేసి ఉండాలి
-డెలివరీ సేవల కోసం పదో తరగతి పాస్ అయి ఉండాలి
-స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌పై అవగాహన కలిగి ఉండాలి
-డెలివరీ సేవలు అందించాలంటే డ్రైవింగ్ లైసెన్స్, సొంత వెహికల్ ఉండాలి
-పాన్ కార్డు కలిగి ఉండాలి
-పోస్టల్ శాఖ ఉద్యోగులు ఈ ప్రాంచైజీ తీసుకునేందుకు అనర్హులు
ప్రాంచైజీ ధర ఎంత..?
డెలివరీ, పికప్ సేవలు అందించాలంటే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయాలి. ఇక బుకింగ్ సేవల కోసం రూ.10 వేలు జమ చేయాలి. అన్నీ సేవలు కావాలంటే రూ.15 వేలు డిపాజిట్ చేయాలి. మీరు చేసే ప్రతీ బుకింగ్, పికప్, డెలివరీపై కమిషన్ అందుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ సేవలకు అదనపు కమిషణన్ ఉంటుంది.
దరఖాస్తు ఎలా అంటే..?
ఇండియన్ పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించాక ఆమోదిస్తారు. మనీ డిపాజిట్ చేశాక మీరు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తి చేశాక పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుని పని మొదలుపెట్టవచ్చు. APT 2.0 ఫ్లాట్ ఫామ్ ద్వారా సేవలు నిర్వహించుకోవచ్చు.
