AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది సినిమాలో జాన్వీకపూర్‌ పాత్రపై దుమారం..! అటు అనసూయ.. ఇటు ఆషిక

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై దర్శకుడు బుచ్చిబాబుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ ఇండియన్ సినిమాలలో.. మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రల నిడివి, వాళ్ల పాత్రల ఎంపికల కొందరు నటీమణులు స్పందిస్తున్నారు.

పెద్ది సినిమాలో జాన్వీకపూర్‌ పాత్రపై దుమారం..! అటు అనసూయ.. ఇటు ఆషిక
Peddi
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2026 | 6:40 PM

Share

పెద్ది సినిమాలో జాన్వీకపూర్‌ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో మూవీ మేకర్స్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జాన్వీని తెరపై చూపించిన తీరుతో పాటు.. మరికొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుండటంతో దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగారు. ఏకంగా.. క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నట్టు వెల్లడించారు. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులందరికీ సారీ చెప్తున్నట్టు తెలిపారు. పెద్ది మూవీ కాంట్రవర్సీ అంశంపై నటి అనసూయ కూడా రియాక్ట్‌ అయ్యారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని.. ఇందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చారు. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని సినిమాకి అంటించకూడదని అభిప్రాయపడ్డారు. సమాజంలో జరిగే ప్రతి తప్పునకూ సినిమాను మాత్రమే నిందించడం కరెక్ట్‌ కాదన్నారు. ఎక్స్‌ వేదికగా అనసూయ చేసిన పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇక.. పెద్ది మూవీలో జాన్వీకపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ది సినిమాలో జాన్వీ పాత్రను అభ్యంతరకరంగా చూపించారని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. సందేశాత్మక చిత్రం అని చెప్తూనే.. ఇలాంటి పాత్రను ఎలా చిత్రీకరిస్తారంటూ బుచ్చిబాబుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో.. విమర్శలను సీరియస్‌గా తీసుకున్న మూవీ మేకర్స్.. సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు బుచ్చిబాబు కూడా స్పందించి.. సారీ చెప్పడంతో పాటు.. కొన్ని సీన్స్ మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలోనే తాజాగా సౌత్ ఇండియన్ సినిమాలలో.. మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రల నిడివి, వాళ్ల పాత్రల ఎంపికలపై వచ్చే విమర్శలకు ఆషికా రంగనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ సరసన కేవలం భారీ రెమ్యునరేషన్, క్రేజ్ కోసమే హీరోయిన్లు నటిస్తున్నారని.. నటనకు స్కోప్ లేని పాత్రలను గుడ్డిగా ఒప్పుకుంటున్నారని విమర్శకులు చేసే ఆరోపణలను ఆమె తీవ్రంగా తిప్పికొట్టారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. కమర్షియల్ సినిమాల్లో పాత్రలపై హీరోయిన్స్‌ని నిందించవద్దు.. వ్యవస్థను, నిర్మాతలను ప్రశ్నించండి.. మహిళా పాత్రలు బలహీనంగా ఉంటే అది నటి వైఫల్యం కాదు, రచనలోని లోపం.. పెద్ద సినిమాల్లో భాగం కావాలనే ఆశతో నటీనటులు తమకు వచ్చిన అవకాశాలను అంగీకరిస్తారు. మహిళా పాత్రలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం రచయితలు, దర్శకులు, నిర్మాతల బాధ్యత. సమస్య నటీమణుల్లో లేదు… మహిళా పాత్రలను ఇప్పటికీ పరిమితంగా చూసే సినీ వ్యవస్థలో ఉంది.. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కేవలం యాక్షన్ సీక్వెన్స్‌ల మధ్యలో వచ్చే గ్లామరస్ బ్రేక్స్ లాంటివి.. హీరోయిన్ ఇమేజ్ కంటే హీరో ఎలివేషన్‌పైనే మేకర్స్ దృష్టి ఉంటుందన్నారు. ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గళం విప్పారు అషికా రంగనాథ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us