Farmers Alert: రైతులకు అలర్ట్‌.. సమయం లేదు మిత్రమా.. ఈ రోజే చివరి తేదీ.. ఈ పని చేయకపోతే ఏమవుతుంది..?

Farmers Alert: దేశంలో మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఎంతో కొంత ఆసరాగా ఉండేందుకు పలు పథకాలను రూపొందించింది. పొదుపు పథకాలు..

Farmers Alert: రైతులకు అలర్ట్‌.. సమయం లేదు మిత్రమా.. ఈ రోజే చివరి తేదీ.. ఈ పని చేయకపోతే ఏమవుతుంది..?
Pm Kisan
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:25 PM

Farmers Alert: దేశంలో మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఎంతో కొంత ఆసరాగా ఉండేందుకు పలు పథకాలను రూపొందించింది. పొదుపు పథకాలు, ఇన్సూరెన్స్‌ ఇలా రైతులకు మేలు జరిగే పథకాలను ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ‘ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌’ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు కొంత ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో సంవత్సరానికి రూ.6000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదిలో మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తోంది. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకున్న రైతులకు.. సెప్టెంబర్‌లో 12వ విడత రానున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ఈ స్కీమ్‌ ద్వారా రైతన్నలు ప్రయోజనం పొందాలంటే ఈ-కేవైసీ చేసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు గడువు ఈ రోజు (ఆగస్టు 31)తో ముగియనుంది. ఈకేవైసీ చేయని రైతులు వెంటనే పూర్తి చేసుకోవాలి.

ఈ-కేవైసీ చేసుకోకపోతే ఏమవుతుంది..?

ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ జమ కావని గుర్తించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేపదే రైతులకు సూచించింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఆగస్టు 31తో గడువు పూర్తి కానుంది. తర్వాత పెంచుతుందా ..? లేదా అనేవి షయం ఇంకా తెలియదు. ఒక వేళ ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోనట్లయితే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా, ఇది వరకు ఈకేవైసీ చేసుకునేందుకు జూలై 31 గడువు ఉండేది. తర్వాత ఆ గడువును ఆగస్టు 31 వరకు పెంచింది. ఇప్పుడు ఈ గడువు కేవలం ఈ రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈకేవైసీ చేసుకోలేని రైతులు వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఎలా..?

1. ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.

3. అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

4. ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

5. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.

6. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇలా కాకుండా మీ దగ్గరలోని మీ సేవ కేంద్రంలోకి వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈకేవైసీకి ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. మరి గడువు పొడిగిస్తుందా..? లేదా అనేది చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
R Ashwin: గతేడాది రూ. 5 కోట్లు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రైజ్‌
R Ashwin: గతేడాది రూ. 5 కోట్లు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రైజ్‌
అవునా.! నిజామా.! దళపతి చివరి సినిమా బాలయ్య సూపర్ హిట్‌కు రీమేక్.?
అవునా.! నిజామా.! దళపతి చివరి సినిమా బాలయ్య సూపర్ హిట్‌కు రీమేక్.?
రాయల సీమ స్టైల్‌లో నాటు కోడి పులుసు ఇలా చేశారంటే అదుర్సే ఇక!
రాయల సీమ స్టైల్‌లో నాటు కోడి పులుసు ఇలా చేశారంటే అదుర్సే ఇక!
ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..
ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..
గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు
గ్యారెంటీ వార్.. కాంగ్రెస్ టార్గెట్‌గా బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.