AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: ఆ రాశులకు గోల్డెన్ టైమ్..! అరుదైన ధన, భాగ్య యోగాలు ఖాయం

జూన్ 11, 12, 13 తేదీల్లో చంద్రుడు కుజుడు, గురువులతో కలిసినప్పుడు అరుదైన చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం సంభవించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగాలు ధనలాభం, రాజయోగ ఫలితాలను ప్రసాదించే శక్తి కలిగినవిగా భావిస్తారు. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ యోగాల ప్రభావం కేవలం మూడు రోజులకే పరిమితం కాకుండా, దీర్ఘకాలం పాటు శుభ ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి.

Lucky Zodiacs: ఆ రాశులకు గోల్డెన్ టైమ్..! అరుదైన ధన, భాగ్య యోగాలు ఖాయం
Wealth And Seccess Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 6:19 PM

Share

చంద్రుడుతో కుజ, గురు, శుక్ర, బుదులు కలిసినప్పుడు ధన యోగాలు, రాజయోగాలు ఏర్పడతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇందులో కుజ, గురువులతో ఏర్పడిన చంద్ర మంగళ, గజ కేసరి యోగాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (జూన్) 11, 12, 13 తేదీల్లో సంభవించే ఈ రెండు యోగాల వల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులు నక్క తోకను తొక్కబోతున్నాయి. ఈ యోగాల ప్రభావం ఈ మూడు రోజులకే పరిమితం కాకుండా చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. మేష రాశిలో చంద్రుడితో కుజుడు కలవడం, కర్కాటక రాశిలో చంద్రుడికి చతుర్థ కేంద్రంలో గురువు ఉండడం వల్ల ఈ రెండు యోగాలు కలిగాయి.

  1. మేషం: ఈ రాశిలో చంద్ర మంగళ యోగం, చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మంచి ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం, ధన స్థానంలో గజకేసరి యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం, దశమంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. జీతభత్యాలు పెరగడం, లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. బాగా అరుదైన విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది.
  4. తుల: ఈ రాశికి సప్తమ, దశమ స్థానాల్లో చంద్ర మంగళ, గజకేసరి యోగాలు పడుతున్నందువల్ల అనేక ఉద్యోగ విషయాల్లో వీరి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా తప్పకుండా దశ తిరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి ఈ రెండు మహా భాగ్య యోగాలు చతుర్థ, సప్తమ స్థానాల్లో ఏర్పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్మును, బాకీలు, బకాయిలను రాబట్టుకుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.
  7. మీనం: ఈ రాశికి ధన, పంచమ స్థానాల్లో ఈ గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి.

Follow Us