AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

June Born Astrology: జూన్ నెలలో పుట్టిన వారికి.. పట్టిందల్లా బంగారం!

జూన్ 9 తర్వాత పుట్టిన రోజు జరుపుకుంటున్నవారికి ఈ నెలంతా సుఖసంతోషాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో రవి గ్రహం వృషభ, మిథున రాశుల్లో సంచారం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం, బుధ–శుక్రులు ధన స్థానంలో, కుజుడు లాభ స్థానంలో సంచరించడం వల్ల ఈ నెలలో పుట్టిన వారి జీవితాల్లో సానుకూల మార్పులు, ఆర్థిక పురోగతి, అదృష్ట వృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉంది.

June Born Astrology: జూన్ నెలలో పుట్టిన వారికి.. పట్టిందల్లా బంగారం!
June Birthday Horoscope 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 3:43 PM

Share

జూన్ నెలలో పుట్టిన రోజు జరుపుకుంటున్నవారికి, ముఖ్యంగా జూన్ 9 తర్వాత పుట్టిన రోజు జరుపుకుంటున్నవారికి ఈ నెలంతా సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో, భోగభాగ్యాలతో గడిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలలో పుట్టినవారికి రవి గ్రహం వృషభ, మిథున రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ నెలలో పుట్టినవారు నాలుగు గ్రహాల అనుకూలత వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు. గురువు ఉచ్ఛ స్థితికి చేరుకోవడం, బుధ, శుక్రులు ధన స్థానంలో, కుజుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఉద్యోగం

ఇంత వరకూ ఉద్యోగం దొరకని జూన్ జాతకులకు ఈ నెల 9 తర్వాత స్వదేశంలోనే కాక, విదేశాల్లో కూడా అవకాశాలు లభించబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి తప్పకుండా పదోన్నతులు కలగడం, అధికార యోగం పట్టడం జరుగుతుంది. ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

ఆదాయం

ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా మారుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. సొంత ఇంటి కల నెర వేరే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును, రాదనుకున్న సొమ్మును పట్టుదలగా రాబట్టుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరగడంతో పాటు, శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు.

శుభ కార్యాలు

గురు, శుక్ర బలం అధికంగా ఉన్నందువల్ల ఈ రాశివారి కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు, కొన్ని దైవ కార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. కుటుంబ సభ్యులు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో ఒకరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

ఆరోగ్యం

చాలా కాలంగా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నవారికి బాగా ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు తరచూ సూర్యారాధన చేయడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. విహార యాత్రలు, తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. సరైన నియమాలు పాటించడం వల్ల ఈ రాశివారి ఆరోగ్యం మెరుగ్గా సాగిపోయే అవకాశం ఉంది.

Follow Us