AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 27 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ధనలాభం..హెల్త్ విషయంలో వారు జాగ్రత్త

Horoscope Today (June 27, 2026): శనివారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. కొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు కలిసిరానుండగా, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీ రాశికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూన్ 27 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ధనలాభం..హెల్త్ విషయంలో వారు జాగ్రత్త
Horoscope Today 27 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 27, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ కృషికి, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాలవారికి రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని నింపుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అవసరానికి మించి డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరు మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడ తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. మిత్రుల వల్ల డబ్బు నష్ట పోయే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్ని పూర్తి చేయడంలో ఆలస్యం తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో శ్రమ మిగులుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ‍ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి బాగా తగ్గుతుంది. బంధు వుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు అందుతాయి. వ్యవహార జయానికి, కార్యసిద్ధికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. కీలక విషయాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు త్వరితగతిన పూర్తవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు నిర్వహిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగ సూచనలున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సామాజికంగా గౌరవమర్యాదలు పెరుగుతాయి. సోదరు లతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలనిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించి అధికారులు మెప్పు పొందు తారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది రుణ సమస్యలు తీరిపోతాయి. కుటుంబ జీవితం ప్రశాం తంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. అధికారులు సామరస్యంగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. సోదరులతో స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యలు బాధించకపోవచ్చు. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కొన్ని కీలక వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇతర కార్యకలాపాలన్నీ అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. సహోద్యోగులతో ఒకటి రెండు సమస్యలుండే అవకాశం ఉంది. చేపట్టిన ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొందరు బంధు మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో విభేదాలు, వివాదాలు తొలగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా బాగా న‌ష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. లాభాలకు, రాబడికి లోటుండదు. అన్ని రంగాల వారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ముఖ్య మైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

Follow Us