AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Astrology: ఆర్థికంగా గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారు ప్రయత్నిస్తే సక్సెస్ పక్కా!

కొద్ది ప్రయత్నంతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటి అనుకూల ఫలితాలు ఆరు రాశులకు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో తృతీయ స్థానం బలంగా ఉన్నప్పుడు ప్రయత్నం, చొరవ, తెగువ వంటి లక్షణాలు పెరుగుతాయి. ప్రస్తుతం మేషం, మిథునం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ఈ స్థితి అనుకూలంగా ఉండటంతో ఉద్యోగం, ఆర్థికం, వివాహం, విదేశీయానం వంటి రంగాల్లో ఎంత ప్రయత్నిస్తే అంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.

Telugu Astrology: ఆర్థికంగా గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారు ప్రయత్నిస్తే సక్సెస్ పక్కా!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 6:08 PM

Share

కొద్ది ప్రయత్నంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి, మనసులోని కోరికలు తీరడానికి ఆరు రాశులకు అవకాశం కలుగుతోంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ తృతీయ స్థానం బలంగా ఉన్న పక్షంలో కొద్దిపాటి ప్రయత్నంతో ఆశయాలు, ఆశలు, కలలు, కోరికలను సాకారం చేసుకోవడం జరుగుతుంది. తృతీయ స్థానం ప్రయత్నం, వృద్ధి, చొరవ, తెగువ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రస్తుతం మేషం, మిథునం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులకు తృతీయ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికం, ఉద్యోగం, పెళ్లి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి వీరు ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.

  1. మేషం: ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో అత్యంత శుభ గ్రహాలైన బుధుడు, ఈ నెల 15 తర్వాత రవి సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తమ లక్ష్యాలు, ఆశయాలను సాధించుకునే అవకాశం ఉంది. వీరి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు, ఆ తర్వాత శుక్రుడు సంచరిస్తున్నందు వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి బాగా అవకాశం ఉంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా జూలై ఆఖరు లోగా అనుకోని విజయాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కు తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.
  3. ధనుస్సు: ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. వీరు తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందుతారు. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి, తమ ఆశల్ని నెరవేర్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది.
  4. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, స్వల్ప ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
  5. కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభం పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ నెల 15 వరకు రవి, 20 నుంచి కుజుడి సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగా లకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

Follow Us