AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వర్షంలో డెలివరీ బాయ్ కష్టాన్ని చూసి కరిగిపోయిన వృద్ధుడు.. అపరిచితుడి సాయానికి జనం ఫిదా!

కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రజలు వెనుకాడతారని, ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయిందని తరచూ వింటూ ఉంటాం. కానీ, సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఒక హృదయ విదారక, స్ఫూర్తిదాయక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి స్వార్థం, గుర్తింపు ఆశించకుండా ఒక అపరిచిత వ్యక్తి చేసిన సహాయం నెటిజన్ల మనసులను గెలుచుకుంటూ, విస్తృత ప్రశంసలు అందుకుంటోంది.

Viral Video: వర్షంలో డెలివరీ బాయ్ కష్టాన్ని చూసి కరిగిపోయిన వృద్ధుడు.. అపరిచితుడి సాయానికి జనం ఫిదా!
Elder Man Helped Delivery Boy
Balaraju Goud
|

Updated on: Jun 27, 2026 | 1:54 PM

Share

కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రజలు వెనుకాడతారని, ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయిందని తరచూ వింటూ ఉంటాం. కానీ, సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఒక హృదయ విదారక, స్ఫూర్తిదాయక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి స్వార్థం, గుర్తింపు ఆశించకుండా ఒక అపరిచిత వ్యక్తి చేసిన సహాయం నెటిజన్ల మనసులను గెలుచుకుంటూ, విస్తృత ప్రశంసలు అందుకుంటోంది.

ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక డెలివరీ బాయ్ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ పెట్రోల్ నింపుకోవడానికి ఒక పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి క్యూలో నిలబడిన అతని వంతు రాగానే, తన దగ్గర ఉన్న నోట్లు వర్షానికి తడిసిపోయాయని అక్కడి మహిళా ఉద్యోగికి చూపించాడు. ఆ నోట్లు చిరగలేదని, కేవలం తడిగా మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అయితే, అంతగా తడిసిపోయిన నోట్లను తీసుకోవడం కష్టమని ఆ మహిళా ఉద్యోగి నిరాకరించింది.

దానికి ఆ యువకుడు.. ప్రస్తుతానికి ఈ నోట్లను ఉంచుకోవాలని, తన దగ్గర వేరే నోట్లు లేనందున తర్వాత వచ్చి మంచి నోట్లు ఇస్తానని బదులిచ్చాడు. తన దగ్గర ఆన్‌లైన్ UPI ద్వారా చెల్లింపులు చేయడానికి స్మార్ట్‌ఫోన్ కూడా లేదని తన దీనస్థితిని వివరించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇంతలో డెలివరీ బాయ్ పడుతున్న కష్టాన్ని, అక్కడి సంభాషణను అతని వెనుక క్యూలో నిలబడిన ఒక వృద్ధుడు గమనించాడు. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే స్పందించాడు. ఆ యువకుడి వద్దకు వచ్చి, “నీకు ఎంత పెట్రోల్ కావాలి?” అని అడిగాడు. తనకు కేవలం 80 రూపాయల పెట్రోల్ సరిపోతుందని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. వెంటనే ఆ వృద్ధుడు పెట్రోల్ పంప్ మహిళా ఉద్యోగితో.. ఆ యువకుడి బైక్‌లో పెట్రోల్ నింపి, ఆ రూ. 80 మొత్తాన్ని తన బిల్లుకు యాడ్ చేయమని కోరాడు.

ప్రజల హృదయాలను గెలిచిన మాట ప్రతి ఒక్కరిని కదిలించింది. పెట్రోల్ నిండిన తర్వాత ఆ వృద్ధుడు సదరు యువకుడితో.. “నువ్వు కూడా భవిష్యత్తులో ఎవరికైనా సహాయం చేయాలి” అని చెప్పడం ఈ వీడియోలోనే అత్యంత కీలకమైనది. ఆ మాట అందరినీ కదిలించే ముఖ్యాంశంగా నిలిచింది. సహాయం చేయడం మాత్రమే కాకుండా, ఆ సాయాన్ని ఒక చైన్ లాగా ముందుకు తీసుకెళ్లాలనే ఆ వృద్ధుడి గొప్ప ఆలోచన ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ చిన్న వీడియో సమాజంలో పరస్పర సహాయ సహకారాలు, సానుభూతి ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Infopedia247 (@infopedia247)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us