పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు
పొరుగువారి బాల్కనీలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఓ వృద్ధుడిని ప్రమాదకర సాహసానికి దారి తీసింది. వందల అడుగుల ఎత్తులో కిటికీ బయట సన్నని అంచుపై కూర్చుని మొబైల్‌తో వీడియో తీస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటన ప్రైవసీ ఉల్లంఘన, భద్రతా అంశాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమైంది.
పొరుగువారి బాల్కనీలోకి దొంగచాటుగా తొంగిచూడడమే కాకుండా, దాన్ని మొబైల్‌లో రికార్డ్ చేయడం కోసం ఒక వృద్ధుడు చేసిన ప్రమాదకర సాహసం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏ చిన్న పొరపాటు జరిగినా వందల అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. అతడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ అతను ప్రవర్తించిన తీరు నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. సమీపంలోని మరొక భవనం నుంచి ఒక వ్యక్తి సాధారణంగా అపార్ట్‌మెంట్ సముదాయాన్ని వీడియో తీసే క్రమంలో ఆ పెద్దాయన నిర్వాకం బయటపడింది. ఆ హైరైజ్ బిల్డింగ్ లోని ఒక నిర్దిష్ట ఫ్లాట్‌పైకి కెమెరాను జూమ్ చేయగా.. భూమికి చాలా ఎత్తులో ఉన్న కిటికీ బయటి సన్నని కాంక్రీట్ అంచుపై ఆ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. చేతిలో మొబైల్ పట్టుకుని, పక్కనే ఉన్న ఫ్లాట్ బాల్కనీ వైపు ముందుకు వంగుతూ, ఆ గదిలో జరిగే విషయాలను రికార్డ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లిప్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రైవసీ ఉల్లంఘనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పొరుగువారిపై నిఘా పెట్టడానికో లేదా వీడియోల మోజులోనో ఇంతలా తెగించడం ముమ్మాటికీ నేరమేనని అభిప్రాయపడుతున్నారు. అపార్ట్‌మెంట్ సొసైటీలు వెంటనే జోక్యం చేసుకుని, సదరు వృద్ధుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు
మొఘలుల నుంచి మోదీ వరకు.. మనసులు గెలుస్తున్న ‘మామిడి’ దౌత్యం
వీధికుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు
చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ
‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్..
హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. లొంగిపోయిన కిల్లర్
రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

