Honda : బైక్‌లతో పోటీ పడే అడ్వెంచర్ స్కూటీ.. యాక్లివా తర్వాత హోండా సంచలనం.. ఫీచర్స్ చూస్తే..
హోండా యాక్టివా.. భారతీయ ఇళ్లలో ఈ పేరు తెలియని వారుండరు. దశాబ్దాలుగా మన రోడ్లను ఏలుతున్న ఈ ఫ్యామిలీ స్కూటర్ సక్సెస్ తర్వాత, హోండా ఇప్పుడు రూట్ మార్చింది. కేవలం ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే సాధారణ స్కూటర్ల కాలానికి చెక్ పెడుతూ.. లాంగ్ రైడ్స్, అడ్వెంచర్ ఇష్టపడే బైకర్ల కోసం ఒక సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. అదే హోండా ఏడీవీ 160 (Honda ADV 160). దీనికి సబంధించిన పూర్తి ఇవరాలు చూద్దాం పదండి.

స్కూటీ లవర్స్‌కు ప్రముఖ మోటారు వాహనాల తయారీ సంస్థ హోండా త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెప్పబోతుంది. ఫ్యామిలీ కస్టమర్స్‌ను దృష్టిలో ఉంచుకొని యాక్టీవా మోడల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చి సక్సెస్ అయిన హోండా ఇప్పుడు పూర్తిగా దానికి బిన్నంగా కొత్త మోడల్ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అదే.. హోండా అడ్వెంచర్-160. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లొకి అందుబాటులోకి వచ్చిన ఈ హోండా ఏడీవి 160.. తన అడ్వెంచర్-స్టైల్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే మన దేశంలో కూడా ఈ అడ్వెంచర్ స్కూలీ లాంచ్ కానుంది.
నివేదికల ప్రకారం, కంపెనీ ఈ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్‌ను ఇండియాలోనే తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత మార్కెట్‌లో హోండా ఏడీవీ 160 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ సిటీ ప్రయాణాల కోసం సాదారణ స్కూటర్‌లను డిజైన్ చేసే హోండా.. ఇప్పుడు ఈ సరికొత్త అడ్వెంచర్‌ను తీసుకురావడం కాస్త కొత్తగానే ఉంది.
హోండా ఏడీవీ 160 ఫీచర్స్ ఇవే
గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్‌లో పొడవైన విండ్‌స్క్రీన్, అప్‌రైట్ రైడింగ్ పొజిషన్, పొడవైన సింగిల్ సీట్, మస్కులర్ బాడీవర్క్, డిఫరెంట్ స్టైల్‌లో ఉండే ఫ్రంట్ సెక్షన్ వంటి అదునాతన ఫీచర్లతో వస్తోంది.165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 14 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 13- ఇంచెస్ రేర్ వీల్, ట్యూబ్‌లెస్ టైర్లతో ఈ స్కూటీ వస్తుంది. ఈ స్కూటర్‌లో లేటెస్ట్ 156.9cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 15.8 HP పవర్, 14.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అలాగే ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, హోండా ACG స్టార్టర్ సిస్టమ్, ఐడల్ స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఫుల్లీ డిజిటల్ ఎల్‌సీడీ (LCD) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ స్మార్ట్ కీ సిస్టమ్, యూఎస్‌బీ (USB) చార్జింగ్ సాకెట్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, భారీ అండర్-సీట్ స్టోరేజ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకోవచ్చు.
మార్కెట్‌లోకి సరికొత్త పోటీ
ఒక వేళ ఈ హోండా అడ్వెంచర్ 160 భారత మార్కెట్లోకి వస్తే.. ఇది హీరో జూమ్ 160 , టీవీఎస్ ఎన్‌టార్క్ 150 , యామహా ఏరాక్స్ 155 వంటి స్కూటర్లతో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. చూడాలి మరి ఇండియన్ మార్కెట్‌లో ఈ హోండా అడ్వెంచర్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
