AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ‘కరుప్పు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! సూర్య-త్రిషల 300 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. మే 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

OTT Movie: 'కరుప్పు' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! సూర్య-త్రిషల 300 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Karuppu Movie
Basha Shek
|

Updated on: Jun 06, 2026 | 5:07 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మే 15న రిలీజైన ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తద్వారా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు ఆర్జే బాలాజీనే ఈ మూవీలో విలన్ గా నటించడం విశేషం. రిలీజై మూడు వారాలు గడిచినప్పటికీ ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల థియేటర్లలో కరుప్పు సినిమా ఆడుతోంది. అయితే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. కరుప్పు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ రెండో వారం లేదా మూడో వారంలో కరుప్పు సినిమా ఓటీటీలోకి రావచ్చునని తెలుస్తోంది. అయితే జూన్ 11 లేదా 12వ తేదీల్లో సూర్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చే అవకాశముందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

కాగా ‘కరుప్పు’ సినిమా థియేటర్లలో తమిళం, తెలుగు భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా డ్రీమ్ వారియర్ బ్యానర్ పై తెరకెక్కిన కరుప్పు సినిమాలో ఇంద్రాన్స్, అనాఘా, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

కాగా చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ రావడంతో హీరో సూర్య ఇప్పుడు పుల్ జోష్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘కరుప్పు’ మూవీకి పని చేసిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, ఎడిటర్‌ కళైవరన్‌కి మహేంద్ర ఎస్‌యూవీ కార్లను బహుమతిగా ఇచ్చాడు. డైరెక్టర్ ఆర్‌జే బాలాజీకి కూడా త్వరలోనే ఓ ఖరీదైన కారు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ లో సూర్య కరుప్పు సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
ఛీ.. వ్యాక్ఈ వీడియో చూస్తే.. మళ్లీ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?