ICICI Bank EMI Rates: కస్టమర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. అధిక ఈఎంఐ బాదుడు షురూ.. అమలు ఎప్పటి నుంచి అంటే..
బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. కొత్త వడ్డీ రేట్లు 1 మార్చి 2023 నుండి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్ సైట్‌లో పేర్కొంది.

కస్టమర్లకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి షాక్ ఇస్తూ వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. కొత్త వడ్డీ రేట్లు 1 మార్చి 2023 నుండి అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తన వెబ్ సైట్‌లో పేర్కొంది. ఒక నెల ఎంఎల్‌సీఆర్ రేటు 8.50 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు నెలల, ఆరు నెలల ఎంఎల్‌సీఆర్ వరుసగా 8.55 శాతం, 8.70 శాతం వరకూ పెంచారు. ఒక సంవత్సరం ఎంఎల్‌సీఆర్ 8.75కు పెరిగింది. దీంతో వాహన, వ్యక్తిగత, గృహ రుణాల్లో కట్టాల్సిన ఈఎంఐ భారీగా పెరుగుతుంది.
అన్ని బ్యాంకులదీ ఇదే బాట
ముఖ్యంగా పెంచిన బేస్ పాయింట్ల వల్ల రుణ మంజూరు సమయంలో ఈఎంఐల ద్వారా చెల్లించే ఆప్షన్ ఎంచుకున్న వారికి వెంటనే ఎఫెక్ట్ పడనుంది. అయితే ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 1 నుంచి 25 బేస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా గత నెలలో ఆర్‌బీఐ రెపో రేట్‌ను 25 బేస్ పాయింట్లను పెంచి, 6.5 శాతానికి చేర్చింది. గతేడాది మే నుంచి దాదాపు ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో కస్టమర్లు బ్యాంకు వద్ద తీసుకున్న రుణాలకు కూడా వడ్డీ రేట్లను పెంచడం తప్పనిసరైంది. సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి టాప్ బ్యాంకులు కూడా గత నెలలోనే బేస్ పాయింట్లు పెంచి కొత్త వడ్డీ రేట్లను ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి తీసుకువచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







