GST Collection: నెల రోజుల్లో రూ.8 వేల కోట్లు తగ్గిన ప్రభుత్వ ఆదాయం.. ఎందుకంటే..

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు జనవరి నెలకంటే తగ్గాయి. అయితే 2022 ఫిబ్రవరితో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో 12 శాతం వృద్ధితో..

GST Collection: నెల రోజుల్లో రూ.8 వేల కోట్లు తగ్గిన ప్రభుత్వ ఆదాయం.. ఎందుకంటే..
GST
Follow us

|

Updated on: Mar 02, 2023 | 3:05 PM

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు జనవరి నెలకంటే తగ్గాయి. అయితే 2022 ఫిబ్రవరితో పోలిస్తే తాజాగా ముగిసిన నెలలో 12 శాతం వృద్ధితో రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి. 2023 జనవరిలో ఈ వసూళ్లు రూ.1.58 కోట్లు. ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల జీఎస్టీ పన్నులు వసూలైనట్టు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 2023 జీఎస్టీ అమలు తర్వాత అత్యధికంగా రూ.11,931 కోట్ల సర్‌ఛార్జ్ వసూలు చేసింది. జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది చరిత్రలో రెండవ అత్యధిక వసూళ్లు. ఏప్రిల్ 2022లో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు. ఇది ఒక రికార్డు.

ఏ వస్తువుపై ఎంత పన్ను వచ్చింది?

ఫిబ్రవరి 2023లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,49,577 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.27,662 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వసూళ్లు రూ.34,915 కోట్లు. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.75,069 కోట్లు వసూలు చేశారు. ఇది కాకుండా రూ.11,931 కోట్ల సెస్‌ను కూడా చేర్చారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి వసూళ్లు ఎందుకు తగ్గాయి?

ఫిబ్రవరి 2022లో రూ.1.33 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం కంటే 2023 ఫిబ్రవరి నెల ఆదాయం 12 శాతం ఎక్కువ. సాధారణంగా ఫిబ్రవరి 28 రోజుల నెల కావడంతో ఆదాయ సేకరణ చాలా తక్కువగా ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరుగుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 8.54 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ ఇటీవల మాట్లాడుతూ.. జీఎస్టీ వసూళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కొత్త సాధారణ స్థాయికి చేరుకున్నాయని, రాబోయే సంవత్సరంలో ఇది ఈ సంఖ్యను దాటగలదని బోర్డు విశ్వసిస్తోందని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి