AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌.. 46 దేశాల ప్రతినిధుల రాక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను..

Andhra Pradesh: విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌.. 46 దేశాల ప్రతినిధుల రాక
Minister Gudivada Amarnath
Subhash Goud
|

Updated on: Mar 02, 2023 | 3:23 PM

Share

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. మరికొద్ది సేపట్లో సదస్సు ప్రాంగణం అంతా సెక్యురిటీ లైజన్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే Advantage.ap.in లో 14వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రేపు వచ్చే డెలిగేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒకరోజు ముందుగానే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.

సీఎం జగన్ గురువారం సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం రేపు జరగబోయే సదస్సుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. శుక్రవారం10.15 గంటలకు సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నారు. రాబోయే ప్రముఖుల అందరి సమక్షంలో ఇనాగురల్ సెషన్ రేపు 2 గంటల ఉంటుంది. అదేవిధంగా రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించకున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్ లో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.

పెట్టుబడుల ద్వారా అధిక ఉద్యోగాల కల్పనే లక్ష్యం

సీఎం జగన్ అంటే క్రెడిబిలిటీ వారి నాయకత్వం పెట్టుబడిదారులకు సహకరిస్తుంది అనే నమ్మకాన్ని రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకి కల్పించామన్నారు. రేపు కూడా అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నామని తెలిపారు. రాష్ట్ర ఎకానమీని అభివృద్ధి చేయడం, అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వివరించారు. 46 దేశాల ప్రముఖులు వచ్చేస్తున్నారు. 8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా వస్తున్నారని.. వారికి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ విందు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డెలిగేట్స్ కు ఆంధ్రా రుచులను పరిచయం చేయబోతున్నామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పెట్టుబడిదారులకు అన్ని రకాల సహరించడానికి సిద్ధం

పెట్టుబడులు పెట్టేవారికి ల్యాండ్స్, అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఎంవోయూలను చేసుకున్నవారు ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం సూచించారని వెల్లడించారు. అదేవిధంగా ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్‌లను క్రియేట్ చేశామన్నారు. ఈ సదస్సు వేదికగా మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్‌గా పెట్టుకున్నారని, భారీగా పెట్టుబడులు తెచ్చి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ సమస్య లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీని రేపే మేం ప్రకటిస్తామని.. లేదంటే 15 రోజుల తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుందన్నారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని మేం సమీక్షించనున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకునే ఎంవోయూలలో 80శాతం రియలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం విజ్ణప్తి మేరకు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఎంవోయూల మాదిరిగా కాకుండా, వాస్తవానికి దగ్గరగా పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించే విధంగా తాము చేసిన ఏర్పాట్లు గమనించిన తర్వాత పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. సదస్సు మార్చి 4 వ తేదీన 12 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి