AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Passports: నకిలీలకు చెక్‌ పెట్టేందుకు ఈ-పాస్‌పోర్టులు రానున్నాయ్‌.. ఎప్పుడంటే..!

E-Passports: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAI) నిబంధనలను అనుసరించి ఫూల్ ప్రూఫ్ సెక్యూరిటీ కోసం చిప్‌తో పొందుపరిచిన ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు..

E-Passports: నకిలీలకు చెక్‌ పెట్టేందుకు ఈ-పాస్‌పోర్టులు రానున్నాయ్‌.. ఎప్పుడంటే..!
E Passports
Follow us
Subhash Goud

|

Updated on: Aug 25, 2022 | 1:33 PM

E-Passports: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAI) నిబంధనలను అనుసరించి ఫూల్ ప్రూఫ్ సెక్యూరిటీ కోసం చిప్‌తో పొందుపరిచిన ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.ఔసఫ్‌ సయీద్‌ అన్నారు. స్టేట్‌ ఔట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నత స్థాయి బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లేవారికి మరిన్ని అవకాశాలు లభించేలా పోర్చుగల్‌, మారిషస్‌, జర్మనీ, మలేసియా సహా 12 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఔసఫ్‌ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు బుధవారం ఈ తెలంగాణ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన సమావేశమై పలు అంశాలపై చర్చించింది.

నకిలీ పాస్‌పోర్టులకు చెక్‌..

పాత పాస్‌పోర్ట్‌ల స్థానంలో ఇ-పాస్‌పోర్ట్‌ల గురించిన భావనను మిస్టర్ సయీద్ తోసిపుచ్చారు. చిప్ పాస్‌పోర్ట్ హోల్డర్ వివరాలను ఎలక్ట్రానిక్ రూపంలో పొందుపర్చడం జరుగుతుందని, ఇది నకిలీ పాస్‌పోర్ట్‌లకు చెక్‌ పెట్టేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యం రాజధానిగా ఇతర దేశాలు గుర్తించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

కోవిడ్-19 తర్వాత మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు రిజినల్‌ పాస్‌పోర్టు కేంద్రాలు తమ వంతు కృషి చేశాయని సయీద్ అన్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయని, విమాన ప్రయాణాలు సైతం పెరిగాయన్నారు. విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ, తత్కాల్ పథకం కింద దరఖాస్తులు ఐదు రోజుల్లో, సాధారణ దరఖాస్తులను రెండు, మూడు వారాల్లో క్లియర్ చేస్తున్నారన్నారు.

2022 జనవరి నుంచి జులై వరకు 3.43 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశామని, 2021లో 4,28,246 పాస్‌పోర్టులు జారీ చేశామని తెలిపారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక పోస్టాఫీసులో పాస్‌పోర్టు సేవా కేంద్రం సదుపాయం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీంతో సేవలు మరింతగా విస్తరించవచ్చని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి