Dubai Visa: భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్.. మరింత సులభంగా వీసా.. పూర్తి వివరాలు
భారతదేశం నుంచి పర్యాటకుల రాకను పెంచుకోవడానికి దుబాయి ఈ ఐదేళ్ల మల్లిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాను ప్రకటించింది. దరఖాస్తు దారుల నుంచి సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించిన సుమారు ఐదు రోజుల్లోనే దీనిని జారీ చేస్తారు. ఈ వీసా ద్వారా ఓకేసారి తొంభై రోజుల పాటు ఆ దేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.
మన దేశం నుంచి ఎక్కువ శాతం మంది టూరిస్ట్ లుగానూ అలాగే ఉద్యోగాల నిమిత్తం వెళ్లే ప్రాంతాల్లో దుబాయ్ కూడా ఒకటి. అటు నుంచి ఇటు నుంచి అటు నిరంతరం రాకపోకలు సాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో దుబాయ్ మన భారతీయులను మరింత ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది. తమ దేశంలోకి రావాలనుకునే ఇండియన్స్ కు వీసా నిబంధనలను ఆ దేశం సులభతరం చేసింది. భారతీయుల కోసం ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాను ప్రకటించింది. దీనిని బిజినెస్, ట్రాన్సిట్, టూరిస్ట్, వర్క్ వీసాలుగా విభజించింది. దీని దరఖాస్తు చేసుకునే విధానం, అర్హతలు తదితర వాటిని తెలుసుకుందాం.
పర్యాటకులను పెంచుకునేందుకు..
భారతదేశం నుంచి పర్యాటకుల రాకను పెంచుకోవడానికి దుబాయి ఈ ఐదేళ్ల మల్లిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాను ప్రకటించింది. దరఖాస్తు దారుల నుంచి సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించిన సుమారు ఐదు రోజుల్లోనే దీనిని జారీ చేస్తారు. ఈ వీసా ద్వారా ఓకేసారి తొంభై రోజుల పాటు ఆ దేశంలో ఉండటానికి అనుమతి లభిస్తుంది. ఏడాదికి గరిష్టంగా 180 రోజులు ఉండేలా.. దాదాపు ఐదేళ్ల పాటు ఆ దేశంలో అనేక సార్లు సందర్శించవచ్చు.
సంబంధాలు మెరుగు..
దుబాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ) తెలిపిన నివేదిక ప్రకారం 2023 నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకూ 2.46 మిలియన్ల భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ నూతన వీసా విధానంతో పర్యాటకులు ఎక్కువ సార్లు దుబాయిని సందర్శించగలరు. వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే విహరయాత్రలు కూడా పెరుగుతాయి. దీని ద్వారా భారత్, దుబాయ్‌ల మధ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. డీఈటీ సమీపంలోని ప్రాక్సిమిటీ మార్కెట్ రీజినల్ హెడ్ బాదర్ అలీ హబీద్ మాట్లాడుతూ భారత్‌తో ధీర్ఘకాల సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి దుబాయ్ చేస్తున్నకృషిని ప్రశంసించారు. డీ33 అజెండా లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారం, పెట్టుబడులు, పర్యాటకంగా దుబాయ్ స్థానాన్ని మెరుగుపరిచేందుకు ఈ చర్యలు దోహదపడతాయని డీపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం అభిప్రాయం పడింది. విలాసవంతమైన షాపింగ్, సాంస్కృతిక అనుభవాలు, కుటుంబ స్నేహపూర్వక ఆకర్షణలు, వ్యాపార సమావేశాలు వంటి వివిధ ప్రాధాన్యతలను అందిస్తూ దుబాయ్ విస్తృత శ్రేణి ప్రయాణికులను ఆకర్షిస్తుందన్నారు.
ఎంతో ఉపయోగం..
యూస్ గ్రీన్ కార్డు, ఈయూ రెసిడెన్సీ, యూకే రెసిడెన్సీ కోసం చెల్లుబాటు అయ్యే ఆరునెలల వీసా కలిగి ఉన్న భారతీయ పాస్‌పోర్టు హోల్డర్లకు ఈ ప్రత్యేక సేవ అందిస్తోంది. 14 రోజుల సింగిల్ ఎంట్రీ వీసా ప్రయాణికులకు అందజేస్తారు. ఇది దుబాయ్ చేరకున్న వారికి క్యూలైన్‌లో వేచి ఉండకుండా సహయపడుతుంది.
దుబాయ్ వీసా కోసం కావాల్సినవి..
- ఆరునెలల చెల్లుబాటుతో పాస్‌పోర్టు
- పాస్‌పోర్టు సైజ్ ఫొటో
- యూఏఈలో చెల్లుబాటు అయ్యే మెడికల్ ఇన్స్యూరెన్స్
- నాలుగు వేల డాలర్ల కనీస బ్యాలెన్స్‌తో ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
- యూఏఈలో చిరునామా, ల్యాండ్ లైన్ నంబర్, మొబైల్ నంబర్
- ఫ్లైట్ టికెట్లు, నివాస ధువీకరణ పత్రం
- యూఏఈలోని స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఆహ్వాన పత్రిక
- హోటల్ బుకింగ్, లీజ్ అగ్రిమెంట్‌ను కూడా సమర్పించాలి.
దరఖాస్తు విధానం..
వీసా పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా రూ.4 వేల యూఎస్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్, యూఏఈకి చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా, రౌండ్ ట్రిప్ టికెట్, యూఏఈలో బస చేసే హోటల్, ఇళ్ల చిరునామాతో నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుకు కలర్‌ఫొటో, పాస్‌పోర్టు కాపీ, మెడికల్ బీమా, బ్యాంక్ స్టేట్‌మెంట్, టూర్ ప్రోగ్రామ్, ప్రయాణ టికెట్ ఎంతో అవసరం.
ఆర్థిక సంస్కరణలు..
చమురుపై ఆధారపడడాన్ని తగ్గించుకునే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా యూఏఈ వీసా విధానాల్లో మార్పులు తెస్తోంది. పెట్టుబడిదారులు, విద్యార్థులు, నిపుణులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టింది. గోల్డెన్ వీసా కోసం 2,72,000 యూఎస్ డాలర్ల కనీ స డౌన్ పేమెంట్‌ను తొలగించింది. ఇంకా అనేక చర్యలు చేపట్టింది. వీసా పాలసీల్లో సౌలభ్యం, పోటీ వాతావరణం పెంచడం ద్వారా గ్లోబల బిజినెస్, ఇన్నోవేషన్ హబ్‌గా దుబాయ్ మారుతుందని భావిస్తున్నారు.
నాలుగు రకాల వీసాలు..
దుబాయ్/ యూఏఈ భారతీయుల కోసం నాలుగు రకాల వీసాలను అందజేస్తుంది. వాటిని బిజినెస్, ట్రాన్సిట్, టూరిస్ట్, వర్క్ వీసాలుగా విభజించింది. ఇమిగ్రేషన్ సమయంలో ఒరిజినల్ పాస్‌పోర్టు, దుబాయి/యూఏఈ ఈ వీసా కాపీ అందజేయాలి.
యూఏఈ అందజేస్తున్న వీసాలు..
- 30 రోజుల సింగిల్ ఎంట్రీ వీసా: దీని ద్వారా ఒకసారి దుబాయ్/యూఏఈలో ప్రవేశించవచ్చు. గరిష్టంగా 30 రోజులు ఉండే అవకాశం ఉంది. మీరు వీసా ఆమోదం పొందిన 59 రోజుల లోపు ఆ దేశంలోకి ప్రవేశించాలి.
- 30 రోజుల స్టే మల్టిపుల్ ఎంట్రీ వీసా: మీరు దుబాయి/యూఏఈలో అనేకసార్లు ప్రవేశించవచ్చు. గరిష్టంగా 30 రోజులు ఉండవచ్చు. వీసా ఆమోదం పొందిన 59 రోజుల్లో ఆ దేశంలో ప్రవేశించాలి.
- 90 రోజుల సింగిల్ ఎంట్రీ వీసా: ఒకసారి దుబాయ్‌లో ప్రవేశించవచ్చు. అప్పటి నుంచి గరిష్టంగా 90 రోజులు ఉండే అవకాశం ఉంది. వీసా ఆమోదం పొందిన 59 రోజుల్లో ఆదేశంలో ప్రవేశించాలి.
- 90 రోజుల స్టే మల్టిపుల్ ఎంట్రీ వీసా: దీనిద్వారా అనేకసార్లు దుబాయ్‌లోకి ప్రవేశించవచ్చు. గర్టిష్టంగా 90 రోజులు ఉండే అవకాశం ఉంది. వీసా ఆమోదం పొందిన 59 రోజుల్లో ప్రవేశించాలి.
- మీరు సాధారణ దుబాయ్ వీసా లేదా అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ సమయం రెండింటికీ మారుతుంది. సాధారణ వీసాకు 5 నుంచి 8 రోజులు, అత్యవసర వీసాకు 2 నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..