AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea : ఉద్యోగం కోసం వెతికి టైం వేస్ట్ వద్దు…ఎవరూ చేయని ఈ వ్యాపారాలు చేస్తే..నెలకు లక్షల్లో ఆదాయం..!!

వ్యాపారం చేయాలంటే తెలివితేటలు ఉండాలి. నష్టాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా రాణించగలుగుతాం. నష్టాలు వస్తాయని వ్యాపారమే వద్దనుకోకూడదు. ధైర్యంతో ముందడగు వేయాలి.

Business Idea : ఉద్యోగం కోసం వెతికి టైం వేస్ట్ వద్దు...ఎవరూ చేయని ఈ వ్యాపారాలు చేస్తే..నెలకు లక్షల్లో ఆదాయం..!!
Business Idea
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 03, 2023 | 6:30 AM

Share

వ్యాపారం చేయాలంటే తెలివితేటలు ఉండాలి. నష్టాలు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా రాణించగలుగుతాం. నష్టాలు వస్తాయని వ్యాపారమే వద్దనుకోకూడదు. ధైర్యంతో ముందడగు వేయాలి. కష్టపడిపనిచేయాలి. ఫలితం తప్పకుండా ఉంటుంది. అయితే వ్యాపారం ప్రారంభించే ముందు ఎలాంటి వ్యాపారం చేయాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే స్మార్ట్ స్టార్టప్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాలు ఇప్పుడు కొన్ని చూద్దాం.

ప్రతిఒక్కరూ ఉద్యోగం చేయాలనుకుంటే కుదరదు. ఉద్యోగాలు తక్కువ పోటీ ఎక్కువ. కాలం వ్రుధా చేయకుండా వ్యాపారంవైపు అడుగులు వేయండి. మీరు లాభాలను పొందవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు దానికి గురించి అధ్యయనం చేయడం మాత్రం తప్పనిసరి. ప్రజల అవసరాలేంటీ, వారు ఏం ఆశిస్తున్నారు, వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలి ఇలాంటి మెలకువలు తెలుసుకుంటే వ్యాపారంలో ఈజీగా రాణిస్తాం.

ఈవెంట్ క్యాటరింగ్:

ఇవి కూడా చదవండి

మీకు కుకింగ్ హాబీగా ఉంటే ఈ వ్యాపారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పార్టీలు, పెళ్లిలు, ఏదైనా ఫంక్షన్లకు వంట చేసి డబ్బు సంపాదించవచ్చు. రుచి నచ్చిదంటే కస్టమర్ల అడ్రస్సు వెతుక్కుంటూ వస్తుంటారు. మనకు కావాల్సింది డబ్బు, వారికి కావాల్సింది క్వాలిటీ. ఈ ఒక్క కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తే జీవితంలో వెనక్కి చూడము.

హోం కేర్ సర్వీస్ :

దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీరు కూడా సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడం ప్రారంభించండి. వారికి అన్ని రకాల పనుల్లో సహాయం అవసరం ఉంటుంది.

మెడికల్ కొరియర్ సర్వీస్ :

మీకు డ్రైవింగ్ వచ్చినట్లయితే మీరు మెడికల్ కొరియర్ సర్వీసులో రాణిస్తారు. అవసరమైన వారికి మందులు సరఫరా చేయాలి. హాస్పటిల్, మెడికల్ షాపుతో అగ్రిమెంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అవసరమైతే డ్రైవర్ ను నియమించుకుంటే మీకొంత శ్రమ తప్పుతుంది.

టీ షర్ట్ ప్రింటింగ్ :

మీకు ఫ్యాషన్ పై ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ఈజీగా రాణిస్తారు. మీరు టీ షర్ట్ ప్రింటింగ్ వ్యాపారం ప్రారంభిస్తే..మంచి ఆదాయం ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్లో టీ షర్ట్ పై వేసి అమ్మడం ద్వారా లక్ష సంపాదించవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది.

పెట్ హాస్టల్:

ఈరోజుల్లో పెంపుడు జంతువులకు సంబంధించిన హాస్టళ్ల సంఖ్య పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కుక్కలు, పిల్లులను పెంచుకునేవారు ఎక్కువయ్యారు. వారు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వాటిని పెట్ హాస్టల్లో వదిలేసి వెళ్తున్నారు. మీరు కూడా ఇలాంటి హాస్టల్ ప్లాన్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..