Business Ideas: ఉద్యోగం చేసి బోర్ కొట్టిందా? అయితే ఈ వ్యాపారం చేస్తే అంతకుమించి ఆదాయం సంపాదించవచ్చు.
నేటికాలంలో చాలామంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యావంతులు కూడా ఉద్యోగాలు పక్కన పెట్టి వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

నేటికాలంలో చాలామంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యావంతులు కూడా ఉద్యోగాలు పక్కన పెట్టి వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంలో చేరి లక్షలాది రూపాయలు సంపాదించే వారు మన దగ్గర చాలా మంది ఉన్నారు. మీరు కూడా వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందాలని ఆలోచిస్తుంటే, మీకో మంచి బిజినెస్ ఐడియాను మీకు అందిస్తున్నాం.
హిందూవుల వంటగదిలో మసాలాదినుసులకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందులో ముఖ్యమైంది జీలకర్ర. జీలకర్ర పంటను పండించడం ద్వారా మీరు సంపాదించవచ్చు. జీలకర్ర వంటతో పాటు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. గిరాకీని ఎన్నడూ కోల్పోని సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి.
దేశంలోని జీలకర్రలో 80 శాతానికి పైగా గుజరాత్, రాజస్థాన్‌లలోనే పండిస్తున్నారు. ఐదెకరాల్లో ఈ పంటను సాగుచేస్తే..2 లక్షల ఆదాయం పొందవచ్చు. దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. జీలకర్ర మొక్క 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొడి ఇసుకతో కూడిన లోమ్ నేలలో వృద్ధి చెందుతుంది. జీలకర్ర పంట పక్వానికి దాదాపు 110-115 రోజులు పడుతుంది. భారతదేశంలో జీలకర్రను అక్టోబర్ నుండి నవంబర్ వరకు సాగుచేస్తారు. హార్వెస్టింగ్ ఫిబ్రవరిలో జరుగుతుంది. సాధారణంగా మార్చిలో తాజా పంట మార్కెట్‌కు వస్తుంది. జీలకర్ర మొక్క ఎత్తు 15 నుండి 50 సెం.మీ వరకు పెరుగుతుంది.




జీలకర్ర పంటను ఎలా పండించాలి? :
జీలకర్ర సాగుకు తేలికపాటి. లోమీ నేల అనుకూలమైంది. అటువంటి నేలలో జీలకర్రను సులభంగా పండించవచ్చు. విత్తే ముందు పొలాన్ని సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర విత్తే పొలాన్ని కలుపు తీసి శుభ్రం చేయాలి. జీలకర్ర ఉత్తమ రకాల్లో మూడు రకాల పేర్లన్నాయి. వాటిలో RZ 19, 209, RZ 223 , GC 1-2-3 రకాలు మంచివి. 120-125 రోజులలో కోతకు వస్తుంది. ఇది హెక్టారుకు 510 నుండి 530 కిలోలు పంట పండించవచ్చు.
జీలకర్ర పంట ద్వారా ఆదాయం:
మీరు ఒక హెక్టారులో 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనాన్ని విత్తుకోవచ్చు. హెక్టారుకు రూ.30 వేల నుంచి 35 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. జీలకర్ర కిలోకు 100 రూపాయలు ఉంటే హెక్టారుకు 40 నుండి 45 వేల రూపాయల వరకు లభిస్తుంది. ఐదెకరాల విస్తీర్ణంలో జీలకర్ర సాగు చేస్తే రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు లాభం చేకూరుతుంది.
జీలకర్ర హోల్‌సేల్ వ్యాపారం:
మీరు జీలకర్రను పండించలేకపోతే, మీరు జీలకర్ర హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. జీలకర్రను ధాన్యం మార్కెట్ల నుండి లేదా గుజరాత్, రాజస్థాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. చిల్లర వ్యాపారులకు విక్రయించవచ్చు. జీలకర్రను కూడా ప్యాక్ చేసి విక్రయించవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఇంట్లో ప్రారంభించడం తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారం. పెద్ద ఎత్తున, బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కంపెనీ పేరు నమోదు, స్థలం, లేబర్ మొదలైన వాటిలో చాలా పెట్టుబడి అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



