TATA’s First Car: భారత్‌లో రతన్ టాటా విడుదల చేసిన మొట్టమొదటి స్వదేశీ కారు ఏదో తెలుసా?
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ బుధవారం (ఆగస్టు 9) ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. టాటా గ్రూప్‌లో ఆయన అనేక కంపెనీలను పెంచారు. వీటిలో ఒకటి టాటా మోటార్స్. ఇది నేడు భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటి...
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ బుధవారం (ఆగస్టు 9) ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. టాటా గ్రూప్‌లో ఆయన అనేక కంపెనీలను పెంచారు. వీటిలో ఒకటి టాటా మోటార్స్. ఇది నేడు భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటి. రతన్ టాటా భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కారును కూడా విడుదల చేశారు. ఈ రోజు టాటా మోటార్స్ కార్లు వాటి భద్రతకు ప్రసిద్ధి చెందడానికి కారణం కూడా ఆయనే.
టాటా ఇండికా మొదటి భారతీయ కారు:
రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ మొదటి భారతీయ కారు టాటా ఇండికాను విడుదల చేసింది. 1998లో ఇండికా మొదటి స్వదేశీ కారుగా ప్రదర్శించారు. ఇది కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది. అందువల్ల ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు.
ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. ఒక్క రోజులోనే ఇంత పెరిగిందా? పండగకు ముందు భారీగా పెరిగిన బంగారం ధర!
2023 టాటా ఇండికా 25వ వార్షికోత్సవం సందర్భంగా రతన్ టాటా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు టాటా ఇండికా రూపంలో పుట్టిందని పోస్టులో పేర్కొన్నారు. ఈ కారు తన హృదయానికి చాలా దగ్గరైందని రతన్ చెప్పాడు.
ఇది కూడా చదవండి: Noel Tata: ఇప్పుడు రతన్ టాటా బాధ్యతలు చేపట్టే నోయెల్ టాటా ఎవరో తెలుసా?
టాటా ఇండికా ఫీచర్లు:
టాటా ఇండికా భారతీయ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రూపొందించబడింది. అప్పుడు ఒక కాంపాక్ట్, మంచి మైలేజ్ కారు అవసరం ఉంది. ఇండికా చాలా సౌకర్యవంతమైన కారు. ఇందులో చాలా స్థలం ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే, ఇండికా లీటరుకు దాదాపు 20 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చేది.
ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్ టాటా గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి