AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Service Charge: రెస్టారెంట్లకు సర్వీస్ చార్జ్ చేసే హక్కుందా..? అసలైన నిబంధనలు తెలిస్తే షాక్

భారతదేశంలో ఇటీవల కాలంలో రెస్టారెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కుటుంబంతో పాటు ఎక్కడికైనా షికారుకు వెళ్లి అనంతరం రెస్టారెంట్‌లో నచ్చిన ఫుడ్ తినివేరి వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో రెస్టారెంట్స్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. అయితే రెస్టారెంట్స్ తినేసిన తర్వాత బిల్ చూసుకుంటే మొత్తం చేసిన బిల్‌పై సర్వీస్ చార్జ్ విధిస్తూ ఉంటారు.

Service Charge: రెస్టారెంట్లకు సర్వీస్ చార్జ్ చేసే హక్కుందా..? అసలైన నిబంధనలు తెలిస్తే షాక్
Restaurent
Nikhil
|

Updated on: Jun 08, 2024 | 9:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో రెస్టారెంట్ కల్చర్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కుటుంబంతో పాటు ఎక్కడికైనా షికారుకు వెళ్లి అనంతరం రెస్టారెంట్‌లో నచ్చిన ఫుడ్ తినివేరి వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో రెస్టారెంట్స్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. అయితే రెస్టారెంట్స్ తినేసిన తర్వాత బిల్ చూసుకుంటే మొత్తం చేసిన బిల్‌పై సర్వీస్ చార్జ్ విధిస్తూ ఉంటారు. ఇది మరీ ఎక్కువైందని కొందరు రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. అయితే జూన్ 2024 నాటికి భారతీయ రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలపై చర్చ అపరిష్కృతంగానే ఉన్నప్పటికీ సర్వీస్ ఛార్జీపై ఢిల్లీ హైకోర్టు విచారణ నవంబర్ 25, 2025న జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో రెస్టారెంట్స్‌లో సర్వీస్ చార్జ్ గురించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

న్యాయ నిపుణులు ఒక రెస్టారెంట్ ‘స్టాఫ్ కంట్రిబ్యూషన్’ వంటి స్వచ్ఛంద ఛార్జీలను జోడించవచ్చని పేర్కొంటున్నారు. ఇది మొత్తం బిల్లు మొత్తంలో 10 శాతానికి మించకూడదు. అయితే రెస్టారెంట్లు అటువంటి ఛార్జీలు చెల్లించమని వినియోగదారులను బలవంతం చేయలేవు. కానీ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రెస్టారెంట్‌లు కస్టమర్‌ని సర్వీస్ ఛార్జీలు చెల్లించమని బలవంతం చేయలేవని పేర్కొంటున్నారు. సర్వీస్ ఛార్జీకి చెల్లించడం అనేది కస్టమర్‌కు సంబంధించిన ఇష్టాన్ని బట్టి ఉంటుందని వివరిస్తున్నారు. అయితే ఈనేపథ్యంలో రెస్టారెంట్ యాజమాన్యం సర్వీస్ ఛార్జీని నేరుగా అడగకుండా ‘స్టాఫ్ కంట్రిబ్యూషన్’ వంటి స్వచ్ఛంద ఛార్జీలను జోడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ‘స్టాఫ్ కంట్రిబ్యూషన్’ జీఎస్టీ మినహా మొత్తం బిల్లు మొత్తంలో 10 శాతానికి మించకూడదు. అయితే కస్టమర్ అటువంటి స్వచ్ఛంద సహకారాన్ని చెల్లించకుండా తిరస్కరించే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల రెస్టారెంట్లు తమ మెనూ ధరలను నిర్ణయించే అధికారం మాత్రమే ఉంటుందని, కస్టమర్ అనుమతి లేకుండా సేవా ఛార్జీలు విధించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన ధరల నియంత్రణలు లేనందున రెస్టారెంట్ యజమానులు తమ సిబ్బందికి ఎక్కువ జీతాలు చెల్లించాలనుకుంటే మెనూ ధరలను పెంచవచ్చని పేర్కొన్నారు.  వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సర్వీస్ ఛార్జీల తప్పుడు విధింపుపై వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు అందాయి. ప్రతిస్పందనగా 2022లో మంత్రిత్వ శాఖ ఈ ఆందోళనలను పరిష్కరించడానికి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతర వాటాదారులతో సమావేశాలను నిర్వహించింది. సమ్మతి లేకుండా సేవా ఛార్జీని విధించకూడదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోర్టు మెట్లు ఎక్కడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..