AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depositing 2000 Notes: రెండువేల నోట్లు డిపాజిట్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? డిపాజిట్ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయలంటే లేదా మార్చుకోవాలంటే ముందుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ (ఎస్ఎఫ్‌టీ) నియమాలను తెలుసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. కొన్ని మార్గదర్శకాలు పాటించకపోతే మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును కూడా పొందే అవకాశం ఉంటుంది. 

Depositing 2000 Notes: రెండువేల నోట్లు డిపాజిట్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? డిపాజిట్ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
2000 Rupes Notes
Nikhil
|

Updated on: May 27, 2023 | 3:45 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో బ్యాంకుల వద్ద నోట్ల మార్పిడి సందడి నెలకొంది. నోట్లు మార్చుకోవడానికి సెప్టెంబర్ నెలాఖరు వరకు సమయం ఉన్నందున తొందరపడవద్దని ఆర్‌బీఐ ప్రజలను కోరుతుంది. అయితే  రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయలంటే లేదా మార్చుకోవాలంటే ముందుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ (ఎస్ఎఫ్‌టీ) నియమాలను తెలుసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. కొన్ని మార్గదర్శకాలు పాటించకపోతే మీరు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసును కూడా పొందే అవకాశం ఉంటుంది.  ఆదాయపు పన్ను చట్టం పన్ను చెల్లింపుదారుడు నిర్వహించే అధిక-విలువ లావాదేవీలపై నిఘా ఉంచడానికి ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్ లేదా నివేదించదగిన ఖాతా గురించిన వివరాలను స్పష్టం పేర్కొంది. ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అధిక-విలువ లావాదేవీల నిర్దిష్ట సెట్‌పై డేటాను సేకరించడానికి పన్ను అధికారులు ఈ ప్రకటనను ఉపయోగిస్తారు.

ఎస్ఎఫ్‌టీ నియమం ప్రకారం ఏదైనా ముఖ్యమైన నగదు లావాదేవీల గురించి బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేయాలి. అదనంగా ఈ సమాచారాన్ని డిపాజిటర్‌కు చెందిన వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్)తో పాటుగా ఫారమ్ 26 ఏఎస్‌లో చూడవచ్చు. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల కోసం వార్షిక గరిష్ట అనుమతించదగిన పరిమితి పొదుపు ఖాతాకు రూ. 10 లక్షలు అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కరెంట్ ఖాతా కోసం ఒక వ్యక్తి తన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.మీ ఖాతాలో గణనీయమైన మొత్తాన్ని జమ చేయడానికి ముందు కొన్ని పత్రాలు కూడా అవసరం. ముఖ్యంగా మీరు తప్పనిసరిగా బ్యాంకును సందర్శించి నగదు డిపాజిట్ స్లిప్‌ను పూర్తి చేయాలి. దీని కోసం మీరు ఖాతా నంబర్, పేరు మరియు ఇతర వివరాలతో సహా మీ బ్యాంక్ సమాచారాన్ని పూరించాలి. ఆదాయపు పన్ను నిబంధనలను అనుసరించి మీరు బ్యాంకులో రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడల్లా పాన్ డాక్యుమెంటేషన్ అవసరం. కాబట్టి మీరు రూ. 2,000 నోట్లను రూ.50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలనుకుంటే మాత్రం మీ పాన్ కార్డ్‌ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిపాజిట్ చేసిన డబ్బుకు సంబంధించిన ఆదాయ వనరుల గురించి బ్యాంకులు తరచుగా ఆరా తీస్తాయి వాటిని డిపాజిట్ స్లిప్‌లో పేర్కొనాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..