AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరో కోణం.. లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి! పూర్తి వివరాలు..

సాధారణ ఫిక్స్ డ్ డిపాజిట్ల తో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి మీకు నష్టాన్ని కూడా కలుగజేయగలవు. మీరు ఒక వేళ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఈ నెగిటివ్ అంశాల గురించి తెలుసుకోవడం మంచిది.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరో కోణం.. లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి! పూర్తి వివరాలు..
Fixed Deposit
Madhu
|

Updated on: May 27, 2023 | 4:00 PM

Share

ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన సురక్షిత పెట్టుబడి పథకాలలో ఫిక్స్ డ్ డిపాజిట్ ఒకటి. దీని ద్వారా స్థిరమైన రాబడి వస్తుందని అందరికీ తెలుసు. అందుకే ఎక్కువశాతం మంది పోస్ట్ ఆఫీసుల్లో గానీ, బ్యాంకుల్లో గానీ దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. అయితే దీని ద్వారా ప్రయోజనాలను ఒకసారి పక్కన పెడితే.. సాధారణ ఫిక్స్ డ్ డిపాజిట్ల తో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి మీకు నష్టాన్ని కూడా కలుగజేయగలవు. మీరు ఒక వేళ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు అయితే ముందు ఈ నెగిటివ్ అంశాల గురించి తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఫిక్స్ డ్ డిపాజిట్ల వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం రండి..

వడ్డీ రేటు మారదు.. ఒక సారి ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతా ప్రారంభిస్తే ఆ సమయంలో ఎంత వడ్డీ రేటు ఉందో అదే వడ్డీ రేటు నిర్ణీత కాల వ్యవధి పూర్తయ్యే వరకూ మారదు. మధ్యలో ఒకవేళ ఎఫ్ డీలపై వడ్డీ రేట్లు ప్రభుత్వం పెంచినా..ఆ పెంపు దీనిపై వర్తించదు. దీనివల్ల మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీని నష్టపోవాల్సి ఉంటుంది.

తక్కువ రాబడి.. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో తక్కువ రాబడి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్ పై జరిమానా.. మీరు మీ టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీకి రాకముందే మూసివేయాలనుకుంటే, మీరు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఇది వినియోగదారులకు బాగా నష్టాన్ని కలుగజేస్తుంది.

నగదు లాక్ అయిపోతుంది.. మీరు ఎఫ్ డీ లో పెట్టిన పెట్టుబడి నిర్ణీత కాల వ్యవధి వరకూ లాక్ అయిపోతాయి. ఒకవేళ మధ్యలో మీరు కొంత డబ్బు తీసుకొని మెరుగైన స్కీమ్ లో మళ్లీ పెట్టుబడి పెట్టాలన్నా కుదరదు.

లిక్విడిటీ సమస్యలు.. మీకు అనుకోని సందర్భంలో అత్యవసరంగా నగదు అవసరం అయ్యిందనుకోండి. అప్పుడు ఎఫ్ డీల నుంచి నగదును యాక్సెస్ చేయడం కష్టసాధ్యం అవుతుంది.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేం.. వడ్డీ రేటు నిర్ణయించబడినందున, దీర్ఘకాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకున్న వ్యక్తులు, ఉదాహరణకు 5 సంవత్సరాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు వారి వడ్డీ రేటు స్తబ్దుగా ఉంటుంది. వారి రాబడులు చాలా సందర్భాలలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేవు.

టీడీఎస్.. మీ మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాల్సి వస్తే, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ ట్యాక్ డిడక్ట్ అట్ సోర్స్ (టీడీఎస్)మినహాయించబడుతుంది. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ మీ మొత్తం పన్ను బ్రాకెట్ ప్రకారం తీసివేయబడుతుంది. ఇది తక్కువ రాబడికి దారి తీస్తుంది.

దివాలా ప్రమాదం.. ఒకవేళ రుణదాత దివాలా కోసం ఫైల్ చేసినట్లయితే, మీ పొదుపులు పోతాయి. ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ప్రకారం, పెట్టుబడిదారుడు కేవలం రూ. 5 లక్షల బీమా మాత్రమే పొందగలుగుతారు. ఎఫ్‌డి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, మిగిలిన మొత్తం నష్టపోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..