Rs 2,000 Notes: బ్యాంకులో రూ. 2,000 నోట్లు డిపాజిట్ చేయాలనుకొంటున్నారా? అయితే ఈ రూల్ గురించి తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బంది పడతారు..
రూ. 2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో జమచేయచ్చు. మార్చుకోవాలంటే 10 నోట్ల వరకూ అవకాశం ఉంది. అంటే రూ. 20,000 నగదును బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. మరి జమ చేయాలంటే.. ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
రూ. 2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో జమచేయచ్చు. మార్చుకోవాలంటే 10 నోట్ల వరకూ అవకాశం ఉంది. అంటే రూ. 20,000 నగదును బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. మరి జమ చేయాలంటే.. ఎంత మొత్తంలో చేయాలి? రిజర్వ్ బ్యాంకు దీనికి ఏమైనా పరిమితులు విధించిందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓ సారి చూద్దాం రండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మే 19న కీలకమైన ప్రకటన చేసింది. చలామణీలో ఉన్న అతి పెద్ద నోటు రూ. 2,000 నోట్లను ఉపసంహరించకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న నోట్లు కూడా 2023 సెప్టెంబర్ 30 నాటికి వాటని బ్యాంకులకు అందించాలని ఆదేశించింది. అయితే ఆ నోట్లు లీగల్ టెండర్ గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. అదే విధంగా బ్యాంకుల్లో రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. నోట్లను మార్చుకోవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనేందుకు వీలు కల్పించింది. రూ.2000 నోట్ల మార్పిడి విషయంలో బ్యాంకులు తమ సొంత ప్రక్రియ, నిబంధనలను అనుసరిస్తాయని ఆర్బీఐ తెలిపింది. మరి డిపాజిట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? తెలుసుకుందాం రండి..
డిపాజిట్ చేసే విధానం ఇది..
ఖాతాదారుడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసే రూ. 2,000 నోట్లకు ఎలాంటి పరిమితి లేదని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిట్ల విషయంలో కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జమ చేయాలనుకుంటే పాన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి.
డీమానిటైజేషన్ కాదు..
రూ.2,000 నోట్లను ఉపసంహరించుకోవడం డీమోనిటైజేషన్ కాదని, చట్టబద్ధమైన చర్య అని, కార్యాచరణ సౌలభ్యం కోసం వాటి మార్పిడిని ప్రారంభించే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కార్యకలాపాల సౌలభ్యాన్ని నిర్ధారించడానికి.. బ్యాంకు శాఖల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఆర్బీ రూ. 2,000 బ్యాంకు నోట్లను ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లలోకి మార్చుకోవచ్చు. అందుకోసం ఏ బ్యాంకులోనైనా ఒకేసారి రూ. 20,000 వరకు నోట్లను తీసుకోవచ్చు. ఈ రూ. 2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్ నవంబర్ 2016లో ప్రవేశపెట్టింది, ఆ సమయంలో చలామణిలో ఉన్న అన్ని రూ. 500, రూ. 1,000 బ్యాంకు నోట్ల రద్దు చేసి, అప్పటి అవసరాల నేపథ్యంలో కొత్త నోటుని తీసుకొచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..