Air Services: వేసవి కాలంలో పెరగనున్న విమాన సర్వీసులు

Air Services: వేసవిలో విమాన సర్వీసులు పెరగనున్నాయి. గతంలో కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిచిపోగా, కరోనా తగ్గుముఖం పట్టడంలో క్రమ క్రమంగా..

Air Services: వేసవి కాలంలో పెరగనున్న విమాన సర్వీసులు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 12, 2022 | 9:37 PM

Air Services: వేసవిలో విమాన సర్వీసులు పెరగనున్నాయి. గతంలో కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిచిపోగా, కరోనా తగ్గుముఖం పట్టడంలో క్రమ క్రమంగా విమానాలు (Flights) ప్రారంభమయ్యాయి. గత సీజన్‌లో 22,980గా ఉన్న భారత విమాన సర్వీసులు, తమ దేశీయ సర్వీసులను 10.1 శాతం మేర పెంచి ఈ వేసవి (Summer) కాలం షెడ్యూల్‌లో 25,309 వీక్లి విమానాలకు చేరుకోనున్నాయని ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇండిగో తన దేశీయ విమానాలను 2022 వేసవిలో 11,130 వీక్లీ సర్వీసులకు(10.4 శాతం మేర) పెంచింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రయాణ పరిమితులు గత 24 నెలల్లో భారతీయ విమానయాన పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. గత రెండు వారాలుగా విమాన ప్రయాణాలు జోరందుకున్నాయి. ఎయిర్‌పోర్ట్ స్లాట్‌లపై గత నెలలో జరిగిన వర్చువల్ మీటింగ్ తర్వాత ఇండియన్ క్యారియర్‌ల వేసవి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది.

వేసవి కాలంలో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని విమానాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికుల ప్రయాణం సులభంగా మారనుంది.

ఇవి కూడా చదవండి:

Gold Hallmark: కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం.. బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..!

Car Offers: గుడ్‌న్యూస్‌.. మారుతి నుంచి టాటా వరకు ఈ కార్లపై అద్భుతమైన ఆఫర్లు..!

SBI Fixed Deposits: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన వడ్డీ రేట్లు..!