Gold Hallmark: కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్..!
Gold Hallmark: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వినియోగదారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని బంగారం అభరణాల స్వచ్ఛతను బీఐఎస్..
Gold Hallmark: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వినియోగదారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని బంగారం అభరణాల స్వచ్ఛతను బీఐఎస్ (BIS) ధృవీకరణ కేంద్రానికి వెళ్లీ పరీక్షించుకోవచ్చని తెలిపింది. నాలుగు బంగారు వస్తువులు (అభరణాలు) స్వచ్ఛత కోసం రూ.200చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదు బంగారు వస్తువుల కంటే ఎక్కువగా ఉంటే ఒక్కో వస్తువుకు రూ.45 చొప్పున చార్జీ ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. దీంతో కస్టమర్లు తమ వద్దనున్న హల్‌మార్క్‌లేని అభరణాల స్వచ్ఛతను తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. భారతీయ ప్రమాణాల మండలి (BIS) గుర్తింపు ఉన్న అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్ (Hallmarking Centres)కు వెళ్లి పరీక్షించుకోవచ్చని సూచించింది. అలాగే వినియోగదారులు అభరణాలను హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్‌ను బీఐఎస్ కేర్ యాప్ నుంచి పరీక్షించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది.
హాల్‌మార్కింగ్ అంటే ?
కస్టమర్ల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. బంగారం కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ నగలను గుర్తించడం కష్టమవుతోంది. గోల్డ్ ఒరిజినల్, నకిలీవి అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్ విధానాన్ని కేంద్రం తీసుకొస్తోంది.
ఇవి కూడా చదవండి: