AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: వరుస నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం.. పెరుగుదలను చూసింది. ప్రధాన ఇండెక్స్‌లు(Sensex, Nifty) 2 శాతం కంటే ఎక్కువ లాభపడింది.

Stock Market: వరుస నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు.. రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద..
Srinivas Chekkilla
|

Updated on: Mar 12, 2022 | 6:42 PM

Share

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ వారం.. పెరుగుదలను చూసింది. ప్రధాన ఇండెక్స్‌లు(Sensex, Nifty) 2 శాతం కంటే ఎక్కువ లాభపడింది. ఈ సమయంలో పెట్టుబడిదారులు చిన్న స్టాక్‌లలో మెరుగైన రాబడిని పొందారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడంతోపాటు వారంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చల వార్తల కారణంగా పెట్టుబడిదారులలో సెంటిమెంట్ పెరగడం ఈ వారంలో ర్యాలీకి ప్రధాన కారణం. ఈ వారం రోజుల్లో మార్కెట్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ వారంలో రూ.6 లక్షల కోట్లు పెరిగింది. వారం ముగిసే సమయానికి బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.252.84 లక్షల కోట్లకు పెరిగింది. కాగా వారం క్రితం ఇది రూ.246.79 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. అంటే వారం వ్యవధిలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

ఈ వారం ట్రేడింగ్ తర్వాత సెన్సెక్స్ 55,500, నిఫ్టీ 16,600 వద్ద స్థరపడ్డాయి. వారంలో 5 సెషన్లలో మార్కెట్ 4 సెషన్లలో లాభాలతో ముగిసింది. ఈ వారం భారీ క్షీణతతో ప్రారంభమైంది. సోమవారం సెన్సెక్స్ 54333 స్థాయి నుంచి 52842 స్థాయికి పడిపోయింది. తర్వాతి 2 సెషన్లలో మార్కెట్ పెరుగుదల కనిపించి, సోమవారం నాటి మొత్తం నష్టాన్ని కవర్ చేసింది. వారం చివరి రెండు రోజుల్లో మార్కెట్ లాభాలను ఆర్జించింది. ఈ వారంలో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడింది. ఇండెక్స్ 2.23 శాతం పెరిగింది. మరోవైపు నిఫ్టీ ఈ వారంలో దాదాపు 400 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.2 శాతం లాభపడింది. మరోవైపు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3 శాతం పెరిగింది. వారంలో అన్ని రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. మీడియా, ఫార్మా రంగ సూచీలు వారంలో 6 శాతం పెరిగాయి. ఐటీ, రియాల్టీ రంగాల సూచీ వారంలో 3-3 శాతం లాభపడింది.

Read also.. Hyderabad: భాగ్యనగరం చుట్టూ రియల్ బూమ్.. ప్రైవేట్‌ రియల్ ఎస్టెట్‌ సంస్థలకు ఇప్పుడిక కొత్త ఛాలెంజ్..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి