Car Offers: గుడ్‌న్యూస్.. మారుతి నుంచి టాటా వరకు ఈ కార్లపై అద్భుతమైన ఆఫర్లు..!
Car Offers: ప్రస్తుతం కార్లపై అనేక ఆఫర్లను అందిస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ. 35,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ 1.0లీటర్..
Car Offers: ప్రస్తుతం కార్లపై అనేక ఆఫర్లను అందిస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ రూ. 35,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ 1.0లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌కు మాత్రమే. హ్యాచ్‌బ్యాక్ 1.2L NA పెట్రోల్, 1.2L టర్బో-డీజిల్ వేరియంట్‌లపై రూ.10,000 నగదు తగ్గింపు అందిస్తోంది. గ్రాండ్ i10 నియోస్‌లో రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా రూ.3,000 (పాత MY2021 మోడల్‌పై రూ.5,000) కార్పొరేట్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. Datsun GOపై రూ.20,000 నగదు తగ్గింపు ఉంది. అదనంగా హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.
మారుతీ, టాటా కార్లపై కూడా తగ్గింపు అందిస్తోంది. మారుతి వ్యాగన్ R పై రూ. 25,000 (1.0L వేరియంట్‌పై) నగదు తగ్గింపును అందజేయగా, 1.2L వేరియంట్‌పై రూ. 20,000 నగదు తగ్గింపును అందజేస్తున్నారు. ఇది కాకుండా కారుపై రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మారుతి స్విఫ్ట్ (LXi ట్రిమ్‌ల)పై మాన్యువల్ వేరియంట్‌పై రూ. 10,000 నగదు తగ్గింపు, VXi మరియు ZXi ట్రిమ్‌లపై రూ. 20,000 నగదు తగ్గింపు ఉంది. ఇది కాకుండా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందిస్తోంది.
అలాగే టాటా టియాగో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ పాత MY2021 మోడల్‌కు మాత్రమే. MY2022 మోడల్‌పై రూ.10,000 నగదు తగ్గింపు (XZ ట్రిమ్ మరియు అంతకంటే ఎక్కువ) రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. దీంతో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3,000 (MY2022 మరియు MY2021 మోడళ్లపై) ఇవ్వబడుతోంది. ఈ డీల్స్ పెట్రోల్ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా CNG వేరియంట్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.
ఇవి కూడా చదవండి: