Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? సమయానికి బిల్లు చెల్లించకుంటే క్రెడిట్‌ స్కోర్‌పై ఎఫెక్ట్‌..!

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డులు వాడే వారి బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తే భారీ ఎఫెక్ట్‌ పడుతుంది. గడువులోగా బిల్లు చెల్లించకపోతే..

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? సమయానికి బిల్లు చెల్లించకుంటే క్రెడిట్‌ స్కోర్‌పై ఎఫెక్ట్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 25, 2021 | 12:32 PM

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌ కార్డులు వాడే వారి బిల్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తే భారీ ఎఫెక్ట్‌ పడుతుంది. గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్‌ స్కోర్‌ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్‌ స్కోర్‌ అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో త‌క్కువ రేట్ల‌తో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న రుణగ్రహీతలు అధిక రుణం ఉన్నవారు క్ర‌మంగా రుణాన్ని చెల్లించ‌క‌పోతే, బ్యాంకులు తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అధిక వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు. లేకపోతే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు. ఇలా క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి ఆయా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి.

క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు..

అందువల్ల, మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల‌ గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అంద‌రికీ అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.

రుణాల విషయంలో ఇబ్బందులు..

అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువుల‌కు హామీదారుగా ఉండ‌టం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయ‌డం వ‌ల‌న త‌మ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుంద‌నే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత‌ అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బ‌కాయిలు ఉన్న‌ట్ల‌యితే మీరు కూడా నష్టపోవచ్చు. ఇలాంటి విషయాలను రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్‌ కార్డులు తీసుకున్న వారు తప్పకుండా గుర్తించుకోవాల్సిన అంశం. ఏ మాత్రం అజాగ్రత్తగా వహిస్తే రుణాల విషయంలో ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటందున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? ఈ విధంగా తీసుకోవచ్చు..!

Indian Railways: మీరు రైళ్లలో దూర ప్రయాణం చేస్తున్నారా..? కేవలం రూ.150లకు ఈ సదుపాయం..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!