Udyogini: మహిళల కోసం కేంద్రం అదిరిపోయే పథకం.. చాలా సులభంగా రూ. 3 లక్షల రుణం పొందే అవకాశం
మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తో్న్న మరో పథకం ఉద్యోగిని పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల రుణం అందిస్తున్నారు. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హతలున్న మహిళలకు కేంద్రం ప్రభుత్వం రూ. 3 లక్షల రుణం పొందొచ్చు...
మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తో్న్న మరో పథకం ఉద్యోగిని పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 3 లక్షల రుణం అందిస్తున్నారు. 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అర్హతలున్న మహిళలకు కేంద్రం ప్రభుత్వం రూ. 3 లక్షల రుణం పొందొచ్చు. అంతేకాకుండా అంగవైకల్యం, వింతత మహిళలకు వారు నెలకొల్పే వ్యాపారం ఆధారంగా రుణ పరిమితి పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక భరోసాన్ని కల్పించడానికి, ఆత్మ నిర్భర్ కార్యక్రమ లక్ష్యాల్లో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 48 వేల మంది మహిళలలు లబ్ధిపొందారు. ఇక ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న మహిళలకు 10 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ మీద రుణం అందిస్తారు. అంగవైకల్యం, వితంతు మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణాన్ని అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలలు 18 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉండాలి.
మహిళల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఆధారంగా రుణం అందిస్తారు. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా తిరిగి చెల్లించకపోతే రుణం లభించదు. దరఖాస్తు చేసుకునే మహిళ ఆధార్ కార్డు, ఇన్‌కమ్ ప్రూఫ్, రెసిడెన్సీ, కాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా బుక్ వంటివి అందిచాల్సి ఉంటుంది. ఉద్యోగిని పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలలు సమీపంలో ఉన్న బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రైవేటు సంస్థలు సైతం ఈ రుణాలను అందిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం మీకు సమీపంలో ఉన్న బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..