Credit Card Portability: మీ కార్డు మీ ఇష్టం.. క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. అక్టోబర్ నుంచి అమలు
తాజాగా ఆర్‌బీఐ ఇలాంటి వారికి ఊరటనిస్తూ క్రెడిట్‌కార్డు పోర్టబులిటీ సదుపాయం తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ కస్టమర్‌లు తమ నెట్‌వర్క్‌లను పోర్ట్ చేయగలరు. ఉదాహరణకు, కార్డ్ వినియోగదారులు వీసా నుంచి మాస్టర్ కార్డ్ నుంచి రూపేకి లేదా ఏదైనా ఇతర నెట్‌వర్క్‌కి లేదా వైస్ వెర్సా వారి ఎంపిక ప్రకారం పోర్ట్ చేయగలరు.

సాధారణంగా మనం క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసినప్పుడు కార్డు మన చేతికి వచ్చే దాకా మనకి ఏ కార్డు వస్తుందో?తెలియదు. బ్యాంకులే మనకు వీసా, మ్యాస్ట్రో, రూపే కార్డులను లభ్యత బట్టి అందిస్తాయి. అయితే తాజాగా రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే సదుపాయం ఉండడంతో చాలా మంది క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డును ఎలా మార్చుకోవాలో? అని గూగుల్లో శోధిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఆర్‌బీఐ ఇలాంటి వారికి ఊరటనిస్తూ క్రెడిట్‌కార్డు పోర్టబులిటీ సదుపాయం తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ కస్టమర్‌లు తమ నెట్‌వర్క్‌లను పోర్ట్ చేయగలరు. ఉదాహరణకు, కార్డ్ వినియోగదారులు వీసా నుంచి మాస్టర్ కార్డ్ నుంచి రూపేకి లేదా ఏదైనా ఇతర నెట్‌వర్క్‌కి లేదా వైస్ వెర్సా వారి ఎంపిక ప్రకారం పోర్ట్ చేయగలరు. ప్రస్తుతం, భారతదేశంలో ఐదు క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్. అక్టోబర్ 1 నుంచి ఆర్‌బీఐ ప్రతిపాదన అమలులోకి వచ్చినప్పుడు కార్డ్ వినియోగదారులు తమ కార్డులను ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్‌బీఐ ఎలాంటి ప్రతిపాదనలు చేసిందో? ఓ సారి తెలుసుకుందాం.
కార్డు పోర్టబులిటీ కోసం ఆర్‌బీఐ తాజా సర్క్యులర్ ప్రకారం ప్రస్తుతం వ్యాఖ్యలు, ఫీడ్‌బ్యాక్ కోసం ప్రత్యేక విండో ఇచ్చింది. బహుళ కార్డ్ నెట్‌వర్క్‌లలో దేనినైనా ఎంచుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందించాలని ఆర్‌బీఐ పేర్కొంది. ముసాయిదా ప్రతిపాదన ప్రకారం కార్డు జారీచేసేవారిని ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లతో టైఅప్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేసే ఒప్పందాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అధీకృత కార్డ్ నెట్‌వర్క్‌లు ప్రస్తుతం డెబిట్ ప్రీపెయిడ్, క్రెడిట్ కార్డ్‌ల జారీ కోసం బ్యాంకులు వాటితో టై అప్ అవుతాయి. అయితే కార్డు కోసం అనుబంధిత నెట్‌వర్క్ ఎంపికను కార్డ్ జారీ చేసేవారు నిర్ణయిస్తారు. ఈ ఎంపిక కార్డ్ జారీచేసేవారు కార్డ్ నెట్‌వర్క్‌తో కలిగి ఉన్న ఏర్పాట్లకు కూడా లింక్ అవుతుంది. అయితే కార్డ్ జారీచేసేవారు, నెట్‌వర్క్‌ల మధ్య ఇటువంటి ఏర్పాట్లు వినియోగదారులకు ఎంపిక స్వేచ్ఛను అందించడం లేదని ఆర్‌బీఐ గుర్తించింది. ఇటీవల ఒక సమీక్షలో కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్ జారీచేసేవారి మధ్య ఉన్న ఏర్పాట్లు కస్టమర్‌లకు ఎంపికను అందించడం లేదని ఆర్‌బీఐ తన డ్రాఫ్ట్ సర్క్యులర్‌లో పేర్కొంది.
ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలివే
- కస్టమర్లకు మరిన్ని ఎంపికలను అందించడానికి చెల్లింపు వ్యవస్థ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్‌బీఐ చర్యలు చాలా అవసరం, ఉపయోగకరమని మార్కెట్ నిపుణులు చెబతున్నారు. ఆర్‌బీఐ ముసాయిదా సర్క్యూలర్‌లో చేసిన ప్రతిపాదానలును చూద్దాం
- కార్డ్ జారీచేసేవారు ఇతర కార్డ్ నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించే కార్డ్ నెట్‌వర్క్‌లతో ఎలాంటి ఏర్పాటు లేదా ఒప్పందాన్ని కుదుర్చుకోకూడదు.
- కార్డ్ జారీ చేసేవారు ఒకటి కంటే ఎక్కువ కార్డ్ నెట్‌వర్క్‌లలో కార్డ్‌లను జారీ చేస్తారు.
- కార్డ్ జారీచేసేవారు బహుళ కార్డ్ నెట్‌వర్క్‌లలో దేనినైనా ఎంచుకోవడానికి వారి అర్హత ఉన్న కస్టమర్‌లకు ఒక ఎంపికను అందిస్తారు. ఈ ఎంపికను కస్టమర్‌లు ఇష్యూ సమయంలో లేదా తదుపరి సమయంలో ఉపయోగించుకోవచ్చు.
- ఈ తాజా నిబంధనలు అక్టోబర్ 1, 2023 నుంచి అమలులోకి వస్తాయి.
పోర్టబులిటీ ఇలా
కార్డ్ నెట్‌వర్క్ పోర్టబిలిటీ ఎంపిక ఇప్పటికే ఉన్న ఒప్పందాలలో లేదా పునరుద్ధరణ సమయంలో అమలు అవుతుంది. ఇకపై కార్డ్ జారీ చేసేవారు కార్డ్ నెట్‌వర్క్‌లు పైన పేర్కొన్న అవసరాలకు కట్టుబడి ఉండేలా చూస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా సవరణ లేదా పునరుద్ధరణ సమయంలో ఇప్పటికే ఉన్న ఒప్పందాలు అమలవుతాయి. అయితే తాజా నిబంధనలు సర్క్యులర్ తేదీ నుంచి అమలు చేస్తారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..