Business Ideas: అరెకరం భూమి ఉన్నా.. సాగు చేస్తూ కోటీశ్వరులు అవ్వొచ్చు! మాజీ సీఎం చూపిన మార్గంలో ట్రై చేయండి..
అర ఎకరం భూమితో లక్షలు సంపాదించే లాభదాయకమైన క్యాప్సికం సాగు గురించి తెలుసుకోండి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం రకాలు పండించి, తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ కూడా సాగు చేసిన ఈ ఆధునిక పద్ధతులు యువ రైతులకు అధిక లాభాలు అందిస్తాయి.

సాగు అందరూ చేస్తారు. కానీ మార్కెట్‌కు తగ్గట్టు.. ఏ పంటకు మంచి ధర ఉంటుందో ముందుగానే అంచనా వేసి ఒక ప్లానింగ్‌తో కొందరు మాత్రమే ట్రెండీ పంటను సాగుచేస్తారు. అలాంటి వాళ్లే అరెకరం భూమితో కూడా కోట్లు సంపాదిస్తారు. అలాంటి పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా యువ రైతులకు ఈ ఐడియా బాగా నచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పంటను మాజీ సీఎం పండించి బాగా సంపాదించారు. ఇంతకీ ఆ పంట ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో క్యాప్సికం సాగు వేగంగా విస్తరిస్తోంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు మూడు ప్రధాన రకాల క్యాప్సికంను విస్తృతంగా పండిస్తున్నారు. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. క్యాప్సికం ప్రత్యేకత ఏమిటంటే మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా రైతులు తాము పండించాలనుకునే రంగును ఎంపిక చేసుకోవచ్చు. ఆకుపచ్చ క్యాప్సికానికి ధర తక్కువే అయినా ఎక్కువగా అమ్ముడుపోతుంది. అలాగే ఎర్ర క్యాప్సికానికి ధర ఎక్కువ. రైతులు ఒకే పొలంలో మూడు రకాల క్యాప్సికంను పండించి, ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా.. మంచి ఆదాయం పొందవచ్చు.
ఇక తెలంగాణలో క్యాప్సికం సాగు విషయానికి వస్తే.. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంత వాసులు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా తన ఫామ్ హైజ్‌లో క్యాప్సికం సాగు చేశారు. ఇవి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అర ఎకరం భూమిలో క్యాప్సికం సాగు చేయడానికి రూ.15,000 నుండి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది, కానీ పంట పూర్తయ్యే సరికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు లాభం వస్తుంది. ఇది సాంప్రదాయ పంటలతో పోలిస్తే చాలా ఎక్కువ రాబడి. వేసవిలో కొంత ఎక్కువ జాగ్రత్త అవసరమైనప్పటికీ, సరైన నీటి సరఫరా, సకాలంలో ఎరువులు వేసినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది.
క్యాప్సికం సాగు ప్రారంభించడానికి రైతులు ముందుగా భూమిని లోతుగా దున్ని, ఆవు పేడ, వర్మీ కంపోస్ట్‌తో చేసిన ఎరువులు కలపాలి. అనంతరం గట్లు తయారు చేసి వాటిపై ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వేస్తారు. ఆ షీట్లలో క్రమంగా రంధ్రాలు చేసి మొక్కలను నాటుతారు. నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీటిపారుదల చేస్తే రెండు నెలల్లోనే పండ్లు మొదలవుతాయి. పండ్లు సిద్దమైన వెంటనే మార్కెట్లోకి పంపవచ్చు. ప్రస్తుతం ఎరుపు క్యాప్సికం కిలో ధర రూ.100 వరకు ఉండగా, ఆకుపచ్చ క్యాప్సికం రూ.40–రూ నుంచి రూ.60 వరకు అమ్ముడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
