AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: ఇప్పుడే కొనండి.. భవిష్యత్తులో వెండి కొనలేరా..? వ్యాపారులు చెబుతున్నది ఇదే!

Silver Price: అమెరికాలో నిల్వలు పెరగడంతో లండన్‌లో భౌతిక లోహం సరఫరా క్రమంగా తగ్గింది. భారతీయ వినియోగదారుల నుండి అపూర్వమైన డిమాండ్ వస్తోంది. లండన్ వాల్ట్‌లలో తగ్గుతున్న సరఫరా గత నెలలో వెండి లీజు రేట్లు రికార్డు స్థాయిలో 34% కంటే..

Silver: ఇప్పుడే కొనండి.. భవిష్యత్తులో వెండి కొనలేరా..? వ్యాపారులు చెబుతున్నది ఇదే!
Subhash Goud
|

Updated on: Nov 10, 2025 | 8:03 AM

Share

Silver: ఇటీవల కాలం నుంచి వెండికి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఎందుకంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర పరికరాలలో వెండిని అధికంగా ఉపయోగిస్తుండటంతో డిమాండ్‌ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వెండి ధరలు ఔన్సుకు 50 డాలర్ల కంటే తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నప్పటికీ.. దాని ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది.US Geological Survey (USGS) తన 2025 కీలక ఖనిజాల జాబితాలో వెండిని చేర్చడం వల్ల.. ఈ విలువైన లోహం ఇప్పుడు కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక, వ్యూహాత్మక లోహంగా కూడా గుర్తింపును పొందింది.

ఇది కూడా చదవండి: Multibagger: ఆ ఇన్వెస్టర్లు జాక్‌పాట్‌ కొట్టేశారు.. కేవలం 10 నెలల్లోనే అదృష్టం తెచ్చిపెట్టిన 5 స్టాక్‌లు!

మొత్తం డిమాండ్‌లో 60 శాతానికి పైగా పారిశ్రామిక రంగంలో వినియోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. సౌర ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, బ్యాటరీలు, విద్యుత్ వాహనాల్లో (EVs) వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పారిశ్రామిక వినియోగం పెరుగుతుండటంతో సరఫరా లోటు కూడా తీవ్రమవుతోంది. అయితే వెండిని ఎక్కువగా వినియోగిస్తుండటంతో రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో సిల్వర్‌ ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో పాటు భూగర్భ నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా మార్కెట్‌లో సరఫరా కఠినతరం అవుతూ ధరల స్థిరత్వం దెబ్బతింటోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Passwords: ఇలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే హ్యాకర్లకు తాళం ఇచ్చినట్లే.. షాకింగ్‌ నివేదిక!

డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన వాణిజ్య యుద్ధాలు, సుంకాలు వెండి మార్కెట్‌లో అస్థిరతను పెంచాయి. 2025 ప్రారంభంలో అమెరికా ఖజానాల్లో పెద్దమొత్తంలో వెండి నిల్వలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ట్రంప్ సుంకాలను విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ భాగస్వాములు భావించారు. ప్రస్తుతం వెండి ధర తగ్గుతున్నప్పటికీ దాని ప్రాధాన్యం, పారిశ్రామిక వినియోగం పెరుగుదల కారణంగా ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. USGS కీలక లోహం హోదా వెండిని పెట్టుబడి, ఉత్పత్తి, వాణిజ్య దృక్కోణంలో మరింత కేంద్రీకృత ఆస్తిగా మార్చింది. భవిష్యత్తులో వెండి మార్కెట్ దిశను నిర్ణయించేది..సౌర టెక్నాలజీ అభివృద్ధి, సరఫరా సమతుల్యం, గ్లోబల్ వాణిజ్య విధానాలు అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త చెబుతున్న బంగారం ధరలు.. తలం ధర ఎంతంటే..

అమెరికాలో నిల్వలు పెరగడంతో లండన్‌లో భౌతిక లోహం సరఫరా క్రమంగా తగ్గింది. భారతీయ వినియోగదారుల నుండి అపూర్వమైన డిమాండ్ వస్తోంది. లండన్ వాల్ట్‌లలో తగ్గుతున్న సరఫరా గత నెలలో వెండి లీజు రేట్లు రికార్డు స్థాయిలో 34% కంటే ఎక్కువగా పెరిగాయి. ఫ్యూచర్స్ ధరల కంటే స్పాట్ ధరలు వేగంగా పెరగడంతో మార్కెట్ కూడా అపూర్వమైన తిరోగమనాన్ని చూసింది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 10, 11న పాఠశాలలకు సెలవు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us